Skip to main content

TS POLYCET Results 2023 : టీఎస్ పాలిసెట్‌-2023 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఫ‌లితాల‌ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్‌-2023 ఫలితాలను మే 26వ తేదీ(శుక్ర‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
TS Polycet 2023 result news telugu
TS Polycet 2023 results

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించిన టీఎస్ పాలీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష మే 17న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 92.94 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. టీఎస్ పాలిసెట్‌-2023 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

☛ టీఎస్ పాలిసెట్‌-2023 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

How to check TS POLYCET 2023 Results?

  • Visit https://results.sakshieducation.com or sakshieducation.com
  • Click on TS POLYCET 2023 Results link available on the home page
  • Enter hallticket number and click on submit button
  • Your results along with rank will be displayed
  • Download and save a copy for further reference

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

మొత్తంగా 1,05,742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా..
పాలీసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 58,520 మంది బాలురు, 47,222 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 54,700 మంది బాలురు, 43,573 మంది బాలిక‌లు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 1,05,742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 98,273 మంది హాజ‌రైన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన అఫీషియల్‌ ఆన్సర్‌ కీ ని కూడా ఇప్పటికే విడుదల చేశారు. 

చ‌ద‌వండి: Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

Published date : 26 May 2023 11:37AM

Photo Stories