Admission in Dravidian University: పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. యూజీసీ నెట్ లేదా జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్, గేట్, సీఈఈడీ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హతతోపాటు జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సైన్స్ విభాగాలు: బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, లైబ్రరీ అండ్Š ఇన్ఫర్మేషన్ సైన్స్.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగాలు: ఇంగ్లిష్, కన్నడ, తెలుగు, తమిళం, తుళు, భాషాశాస్త్రం, జానపద, చరిత్ర, విద్య, తులనాత్మక ద్రావిడ సాహిత్యం.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు యూజీసీ నెట్ లేదా జేఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్ నెట్, గేట్, సీఈఈడీ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించిన వారితో పాటు జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తుల విక్రయం: 12.07.2023 నుంచి 21.07.2023 వరకు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023
వెబ్‌సైట్: https://www.dravidianuniversity.ac.in/
Last Date