Skip to main content

IIT JAM 2024 Notification: ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ(డ్యూయల్‌ డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం..

దేశంలోని ఐఐటీ(ఇండియ¯Œ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ(డ్యూయల్‌ డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌(జామ్‌–2024) పరీక్షను నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
IIT JAM 2024 Notification and Exam Pattern

మొత్తం సీట్ల సంఖ్య: 3000
తెలుగు రాష్ట్రాల ఐఐటీల్లో సీట్ల వివరాలు: ఐఐ­టీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులలో 105 సీట్లను జామ్‌ ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. ఐఐటీ తిరుపతిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌–స్టాటిస్టిక్స్‌లో మొత్తం 60 సీట్లున్నాయి.
అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వా­రు అర్హులు. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సబ్జెక్టులు: ఏడు సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అవి బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమేటిక్స్, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌. వీటిలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష కోసం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్టంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్‌–1లో ఒకటి, సెషన్‌–2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్‌–1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమేటికల్‌ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. 

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌ 60 ప్రశ్నలు–వంద మార్కులు. మూడు విభాగాల్లో(మల్టిపుల్‌ ఛాయిస్, మల్టిపుల్‌ సెలెక్ట్, న్యూమరికల్‌) ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఎ, బి, సి సెక్షన్లుగా విభజించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి. తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభతేది: 05.09.2023.
  • దరఖాస్తులకు గడువుతేది: 13.10.2023.
  • పరీక్ష తేది: 11.02.2024.


వెబ్‌సైట్‌: https://jam.iitm.ac.in/

చ‌ద‌వండి: NGBU PhD Admission 2023: నెహ్రూ గ్రామ భారతి వర్శిటీలో పీహెచ్‌డీలో ప్రవేశాలు

Last Date

Photo Stories