Skip to main content

AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు.. కోర్సుల వివరాలు ఇవే..

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ జర్నలిజం కోర్సుల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తోంది.
admissions in ap college of journalism

కోర్సుల వివరాలు
పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (పీజీడీజే): కోర్సు వ్యవధి 12 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ. 
డిప్లొమా ఇన్‌ జర్నలిజం(డీజే): కోర్సు వ్యవధి 6 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ.
డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(డీటీవీజే): కోర్సు వ్యవధి 6 నెలలు. కనీస విద్యార్హత డిగ్రీ. 
సర్టిఫికెట్‌ కోర్సు ఆఫ్‌ జర్నలిజం(సీజే): కోర్సు వ్యవధి 3 నెలలు. కనీస విద్యార్హత ఎస్‌ఎస్‌సీ.

ప్రవేశం ఇలా
ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కోర్సుల్ని రెగ్యులర్‌గాను, కరస్పాండెన్స్‌(దూరవిద్య విధానం)లోనూ చేయవచ్చు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యం ఉంది. ఇంటి దగ్గర నుంచే పాఠ్యాంశాలను లైవ్‌లో వినవచ్చు. తెలుగు లేదా ఇంగ్లిష్‌ బోధనా మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం
ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేది: 21.08.2023
అడ్మిషన్లు పొందటానికి చివరి తేది: 02.09.2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://apcj.in/
 

చదవండి: Free Civils Prelims Coaching: మనూలో ఉచిత సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కోచింగ్‌.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Last Date

Photo Stories