ఒత్తిడికి దూరంగా.. విజయమే లక్ష్యంగా
Sakshi Education
‘పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌లో విజయానికి ప్రత్యేక దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రశ్నలన్నీ ఎంబీబీఎస్ సబ్జెక్టుల నుంచి అడిగేవే.. కానీ ప్రశ్నించే శైలి భిన్నంగా ఉంటుంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తే విజయం సాధ్యమే’ అంటున్నారు ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఏపీపీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీమెట్)లో 170 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన బాలంకరి శ్రీ రాంరెడ్డి.. సక్సెస్ స్పీక్స్...
స్వస్థలం కర్నూలు జిల్లా నందికొట్కూరు. నాన్న శ్రీనివాస రెడ్డి వినియోగదారుల ఫోరంలో ఉద్యోగి. హైస్కూల్ సమయంలో బదిలీపై విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విజయవాడలోనే చదివాను. మధ్యలో నాన్న తిరిగి నందికొట్కూరుకు వచ్చినా ఎంబీబీఎస్ చదవాలనే నా ఆసక్తిని గమనించి, చదువుకు ఆటంకం కలిగించకూడదని భావించి అక్కడే చదివించారు.
స్ట్రాటజీ + ప్లానింగ్ = సక్సెస్:
పీజీ మెడికల్ ఎంట్రన్‌సలో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. ఇవి 19 సబ్జెక్ట్‌ల నుంచి ఉంటాయి. ఇందులో రాణించాలంటే మొదటి నుంచీ స్పష్టమైన ప్రణాళిక, వ్యూహం అవసరం. అడిగే ప్రశ్నలన్నీ ఎంబీబీఎస్ కోర్సులో చదివిన అంశాలాధారంగానే ఉంటాయి. కానీ ప్రశ్నించే విధానంలో అప్లికేషన్ ఓరియెంటేషన్ ఎక్కువ. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాను.
హౌస్ సర్జన్సీ తర్వాత:
ఎంబీబీఎస్ చదివే విద్యార్థులందరికీ ఎండీ కోర్సు లక్ష్యంగా ఉంటుంది. సాధారణంగా ఆ దిశగా సన్నద్ధతకు ఎంబీబీఎస్ చదివే సమయంలో కానీ.. ఆ తర్వాత హౌస్ సర్జన్సీషిప్ చేస్తున్నప్పుడు కానీ సరిపడినంత సమయం అందుబాటులో ఉండదు. నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాను. హౌస్ సర్జన్సీ సమయంలో కొద్ది స్థాయిలో పీజీ మెడికల్ ఎంట్రన్స్ దృష్టి కోణంలో ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఉపక్రమించింది మాత్రం 2013 మార్చిలో హౌస్ సర్జన్సీ పూర్తయ్యాకే. ఏడాది ప్రిపరేషన్‌కే కేటాయించాను.
పిపరేషన్ ఇలా:
ప్రిపరేషన్‌లో మొదటి రెండు నెలలు.. పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష శైలి, ప్రశ్నల తీరు తదితర అంశాలను పరిశీలించాను. అంతేకాకుండా సంబంధిత అంశాలపై సీనియర్లు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకున్నాను. దాంతో పరీక్ష గురించి పూర్తి అవగాహన రావడంతోపాటు.. విజయంపై ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రతి రోజు సగటున 8 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలక అంశం.. ఒకే సబ్జెక్ట్‌ను ఎక్కువసార్లు చదువుతూ.. అదే అంశంపై ఎక్కువ సమయం కేటాయించడం సరికాదు. అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా వీలైనంత ఎక్కువసార్లు రివిజన్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రిపరేషన్ పరంగా ఈ వ్యూహం చాలా ఉపకరించింది. దీంతోపాటు రైటింగ్ స్పీడ్ కూడా ముఖ్యమే. ఇందుకు మార్గం ప్రాక్టీస్ మాత్రమే. ఇలా ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా సాగడం వల్లే ఈ ఫలితం సాధ్యమైంది.
176 నుంచి ఫస్ట్ ర్యాంకుకు:
మొదటి సారి నిర్వహించి, రద్దు చేసిన పీజీమెట్‌లో 144 మార్కులతో 176వ ర్యాంకు లభించింది. ఈ ర్యాంకుకు జనరల్ ఫిజీషియన్‌లో సీటు లభించేది. వాస్తవానికి ఆ పరీక్షలో 50లోపు ర్యాంకు వస్తుందని ఊహించాను. కానీ ఫలితాలు చూశాక అనుమానం వచ్చింది. కారణం ఎంబీబీఎస్ కోర్సులో టాప్-10,టాప్-20లో నిలిచిన సహచర విద్యార్థులకు కూడా ఎక్కువ ర్యాంకు రావడంతో సందేహాలు తలెత్తాయి. ఆ పరీక్ష రద్దు చేయమని ఫిర్యాదులు చేయడం, దానికి అనుగుణంగా రీ-ఎగ్జామ్ నిర్వహించడంతో నిజమైన ప్రతిభావంతులకు న్యాయం చేకూరింది.
ఎండీ.. జనరల్ మెడిసిన్:
ప్రస్తుత ర్యాంకుతో పీజీలో జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ చదవాలనుకుంటున్నాను. మిగతా స్పెషలైజేషన్స్‌తో పోల్చితే జనరల్ మెడిసిన్‌లో క్లినికల్ అప్రోచ్ ఎక్కువగా ఉండడమే కారణం. అంతేకాకుండా భవిష్యత్తులోనూ ప్రజలతో నేరుగా మమేకమై వైద్య సేవలు అందించే అవకాశం ఎక్కువ. ఎండీ తర్వాత గ్యాస్ట్రోఎంటరాలజీ లేదా నెఫ్రాలజీ విభాగాల్లో డీఎం కోర్సు పూర్తి చేయడమే లక్ష్యం. ఇవి కూడా క్లినికల్ అప్రోచ్ ఉండే కోర్సులే.
ఔత్సాహికులకు సలహా:
పీజీ మెడికల్ ఎంట్రన్స్ ఔత్సాహికులు ఎంబీబీఎస్‌లో చదివిన అంశాలను బేసిక్స్‌గా భావించి.. పీజీమెట్ కోణంలో అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి సమకాలీన మార్పులపై అవగాహన కూడా అవసరం. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాలు పరిశీలించడం ఉపకరిస్తుంది. ఏపీ పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో విద్యార్థులకు అనుకూలించే అంశం నెగెటివ్ మార్కింగ్ లేకపోవడం. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునేలా.. ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్ట్‌లను పునశ్చరణ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో గ్రూప్ డిస్కషన్స్ కూడా లాభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయా స్పెషలైజేషన్లు, వాటిలో లభించే పరిమిత సీట్లను దృష్టిలో పెట్టుకుని.. పోటీ.. ఫలితం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకూడదు. మానసిక సన్నద్ధతే విజయానికి ప్రధాన సాధనం.

Published date : 15 May 2014 05:39PM