అమ్మానాన్నను చూసే...డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నా
Sakshi Education
వైద్యవృత్తిలో ఉన్న అమ్మానాన్నను చూస్తూ పెరిగిన నాకు ఆ వృత్తి గొప్పతనం అర్థమైంది. అందుకే నేను కూడా పెద్ద డాక్టర్ కావాలని కలలు కన్నాను. కష్టపడి చదివితే.. 2017 నీట్‌లో 12వ ర్యాంకు వచ్చింది. జిప్‌మర్‌లో 38వ ర్యాంకు, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో 35వ ర్యాంకు సాధించానంటున్న అర్నవ్ త్రినాధ్ సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే...
నాన్న ఎల్వీకే రాజు ఆప్తల్మాలజిస్ట్, అమ్మ సునందని డయాబెటాలజిస్ట్. ‘నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని. ఎన్‌టీఎస్‌ఈ, కేవీపీవై స్కాలర్‌షిప్స్ కూడా వచ్చాయి. చిన్నప్పుడు అమ్మతోపాటు ఆసుపత్రికి వెళ్లినప్పుడు అమ్మ చేసే వైద్యం చూసి, నాన్న చేసే కంటి శస్త్ర చికిత్సలు దగ్గరుండి చూడడం వల్ల నేను కూడా ఎప్పటికైనా డాక్టర్ కావాలని స్ఫూర్తిపొందా. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నా.
పూర్తి సమయం చదువుకే..
ఇంటర్‌లో చేరినప్పటి నుంచే పూర్తి సమయం చదువుకే కేటాయించా. అక్కడ ఫ్యాకల్టీ చెప్పిన విధంగా నడుచుకున్నా. ఇంటర్‌లో ఫ్యాకల్టీ చెప్పేది వింటే చాలు. వారే ప్రణాళిక రచించి అందుకనుగుణంగా పాఠాలు చెప్పడం, పరీక్షలు నిర్వహించడం చేస్తారు. రాత్రి 10.30 వరకు తరగతులు, స్టడీ అవర్స్‌కు హాజరవుతూ చదవడం అలవాటు చేసుకున్నా. ఇక అక్కడ నిర్వహించే పరీక్షల్లో మార్కుల కంటే రిలేటివ్ ర్యాంకు చూసుకోవాలి. పరీక్షల్లో తప్పులు దొర్లితే వాటిని ఎప్పటికప్పుడూ గుర్తించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి.
ఒత్తిడి సహజం :
ఇంటర్ విద్యార్థుల మీద ఒత్తిడి సహజంగానే ఉంటుంది. రోజు మొత్తంలో 14 నుంచి 16 గంటల పాటు చదివితేగానీ ర్యాంకులు రాని పరిస్థితి. ఒత్తిడి గురించి ఆలోచించినా సమయం వృథా అవుతుంది. ఇంటర్లో సమయం చాలా విలువైంది. ప్రతిరోజు సన్నద్ధమైతేగానీ కోరుకున్న ఫలితాలు రావు. క్లాసులో టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ.. వారు చెప్పిన వాటిని చదివాలి. అక్కడ నిర్వహించే మాక్ టెస్టులకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఏ పరీక్షను మిస్ కావొద్దు. విద్యార్థి చదవడం తప్ప ఇతర ఏ పనులు పెట్టుకోవద్దు. నేను ఇంటర్‌లో వినోదానికి పూర్తిగా దూరంగా ఉన్నాను. ఒక్క సినిమాగానీ, పాటలు, మ్యూజిక్ వినడం వంటి పనులన్నింటికి దూరంగా ఉన్నా. మొబైల్‌కు దూరంగా ఉంటేనే బెటర్.
సూపర్ స్పెషాలిటీ చేస్తా..
ప్రపంచ ఉత్తమ వైద్య కళాశాలల్లో ఢిల్లీ ఎయిమ్స్ ఒకటి. ఇక్కడ 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. నేను మొదట ఏదో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేరాలని భావించా. అయితే ఎయిమ్స్‌లో సీటు లభించడంతో ఇక్కడ చేరిపోయా. భవిష్యత్తులో జనరల్ మెడిసిన్ పీజీ చేద్దామనుకుంటున్నా. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ కూడా చేస్తా !

Published date : 13 Aug 2018 06:38PM