డయాగ్నస్టిక్ మెడిసిన్ చాలా ఇష్టం.. డాక్టర్ పమ్మి షణ్ముక మురళీకృష్ణ, పీజీఎంఈటీ థర్డ్ ర్యాంకర్
Sakshi Education
కష్టపడి చదివితే సాధారణ విద్యార్థి సైతం అసాధ్యాలను సుసాధ్యాలు చేయొచ్చంటున్నారు
పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ 2013లో మూడో ర్యాంక్ సాధించిన డాక్టర్ పి.షణ్ముకమురళీకృష్ణ. వైద్యవృత్తిలో సంతృప్తితోపాటు సేవచేసే అవకాశం లభిస్తుందన్న అమ్మ ప్రోత్సాహంతో మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటానంటున్న మురళీ కృష్ణ సక్సెస్ స్టోరీ....
చాలా ఆనందంగా ఉంది:
ఎన్నో ఒత్తిళ్ల మధ్య రాసిన ఎంట్రెన్స్.. పరీక్ష రాశాక కీ కూడా చూసుకోలేదు. ర్యాంకు వస్తుందని ఊహించలేదు. అప్పటికే కొన్ని జాతీయస్థాయి ఎంట్రన్స్‌ల్లో ఎదురైన అనుభవంతో పెద్దగా ఆశలుపెట్టుకోలేదు. బ్రహ్మదేవుడు రాసిన నుదిటిరాతను నువ్వే మార్చుకోవాలంటూ.. తరచూ అమ్మచెప్పే మాట నిజమనిపించింది. అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ర్యాంకు సాధించటం చాలా ఆనందంగా ఉంది.
ప్రణాళికప్రకారం చదవాలి:
వైద్యరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవ టానికి ప్రధాన కారణం.. అమ్మ. సమాజానికి ఏదైనా చేయాలంటే వైద్య వృత్తితో సాధ్యమని అమ్మ తరచూ చెప్పడంతో మెడిసిన్ వైపు వచ్చా. సగటు విద్యార్థి కూడా ప్రణాళికా ప్రకారం కష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధించొచ్చు. అయితే ఏదో పరీక్షల సమయంలో పుస్తకం తిరగేయటంకాకుండా.. పోటీ తీవ్రంగా ఉండే మెడికల్ పీజీ ఎంట్రన్స్‌కు కనీసం ఏడాదిపాటు అదే లక్ష్యంగా చదవాలి.
మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకుంటా:
పీజీలో జనరల్ మెడిసిన్ తీసుకుంటా. మంచి ఫిజిషియన్ కావాలన్నదే నా లక్ష్యం. ప్రాణాంతకమైన చాలా రోగాలకు తొలిదశలోనే పుల్‌స్టాప్ పెట్టొచ్చు. దానికి ఏకైక మార్గం ఫిజీషియన్!!

Published date : 24 May 2013 02:16PM