డాక్టర్ కావాలనే డాక్టరయ్యా.. డాక్టర్ వొప్పూరి సాయిష్‌రెడ్డి, పీజీఎంఈటీ ఐదో ర్యాంకర్
Sakshi Education
వైద్యవృత్తిలో పెద్దమ్మ, మావయ్యలకు లభిస్తున్న గౌరవం ప్రేరణగా మారాయి. దానికి తగినట్లుగా కష్టపడి చదవటంతో ఎంసెట్‌లో స్టేట్‌ఫస్ట్ ర్యాంకు సాధించి.. లక్ష్యానికి పునాది వేసుకున్నారు వొప్పూరి సాయిష్ రెడ్డి. అదే పట్టుదలతో ఎంబీబీఎస్‌లో చేరిన తొలిరోజు నుంచే సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని..కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి తొలి ప్రయత్నంలోనే పీజీ ర్యాంకు సాధించిన సాయిష్‌రెడ్డి సక్సెస్ స్టోరీ...
సంతోషంగా ఉంది:
మాది కర్నూలు, చదువంతా అక్కడే. అమ్మ అనిత హౌస్‌వైఫ్. నాన్న నాగభూషణరెడ్డి సివిల్ ఇంజనీర్. అన్నయ్య శశాంక్ ఇంజనీరింగ్ పూర్తిచేసి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. మొదట్నుంచి చదువులో ముందుండే వాడిని. ఎంసెట్‌లో స్టేట్‌ఫస్ట్ ర్యాంకర్ని కావటంతో చదువు విషయంలో సీరియస్‌గానే ఉంటాను. పీజీ ఎంట్రన్స్ తొలిప్రయత్నంలోనే మంచి ర్యాంకు రావటం చాలా సంతోషంగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈసారి పేపర్ చాలా టఫ్‌గా ఉందని సీనియర్లు చె ప్పారు. దాంతో టాప్-20లో ఉంటాననుకున్నా. ఐదోర్యాంకు రావటం ఆనందంగా ఉంది.
సబ్జెక్టుపై పట్టుతోనే ర్యాంకు:
పోటీ ఎక్కువగా ఉంది. సుమారు 20 వేల మందికి పైగా పరీక్షరాశారు. ఇంతమందితో పోటీపడాలంటే.. ఆ స్థాయిలో చదవాల్సిందే. బేసిక్స్ మీదే దృష్టిపెట్టాను. అండర్‌గ్రాడ్యుయేషన్‌లో అన్ని సబ్జెక్టులపై ముందు నుంచే పట్టుసాధించాను.దాంతో ర్యాంకు వచ్చింది. ఎం.క్యూ బుక్స్, భాటియా ఇనిస్టిట్యూట్ వారి సీరిస్ ప్రాక్టీసు చేశాను. కేవలం పరీక్షల కోసమేకాకుండా.. ప్రాక్టీసులో కూడా విజయం సాధించాలంటే సబ్జెక్టుపై మంచి అవగాహన ముఖ్యం.
సమాజంలో గౌరవమే ప్రేరణ:
మా పెద్దమ్మ విజయలక్ష్మి ఉస్మానియా యూనివర్శిటీలో మెడిసిన్ పూర్తిచేసి ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్నారు. మావయ్య డాక్టర్ మణివర్ధన్‌రెడ్డి ఆత్మకూరులో మంచిపేరున్న డాక్టర్. చిన్నప్పటి నుంచి వీరిద్దర్నీ గమనిస్తూ ఉండటం వల్ల వారికి సమాజంలో లభిస్తున్న గౌరవం వైద్యరంగాన్ని కెరీర్‌గా ఎంచుకునేలా ప్రేరణనింపాయి.
మంచిడాక్టర్‌గా సేవలందిస్తా:
ఛాలెంజింగ్‌తో కూడుకున్న సర్జరీ విభాగం అంటే చాలా ఇష్టం. స్పెషలైజేషన్ కూడా సర్జన్‌గా చేయాలనే నా కోరిక. మంచి డాక్టర్‌గా సమాజానికి నా వంతు సేవచేయటం నా లక్ష్యం. నా భాగస్వామ్యంగా గ్రామీణప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తా.
నా సలహా..
చదువుతున్న సబ్జెక్టులపై సరైన అవగాహన లేకపోతే.. పరీక్షల్లోనే కాదు.. మెడిసిన్‌పూర్తయి డాక్టర్‌గా కూడా వెనుకబడిపోతాం. తీవ్రమైన పోటీ తప్పదనుకున్నపుడు తప్పకుండా దానికి తగినట్లుగా కష్టపడాలి. సరిగా ప్లాన్ చేసుకుంటే.. ఎవరైనా ర్యాంకర్లు కావచ్చు.

Published date : 24 May 2013 02:19PM