Skip to main content

NEET UG 2023 : నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్ష తేదీ ఇదే.. ఈ ప‌రీక్ష రాయాలంటే అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ- 2023 తేదీలు ఖరారయ్యాయి. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది.
neet
NEET UG 2023

మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 

దరఖాస్తు ఫారమ్‌ను..
నీట్‌ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in, neet.nta.nic.inలలో అందుబాటులో ఉన్నాయి. ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్‌ యూజీ ఎగ్జామ్‌ విధానం, సిలబస్‌, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలను విడుదల చేయనుంది ఎన్‌టీఏ.

అర్హ‌త‌లు ఇవే..
ఈ పరీక్ష రాసేందుకు 17 ఏళ్లు ఆపైబడిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు నీట్‌ పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 645 మెడికల్‌, 318 డెంటల్‌, 914 ఆయూష్‌, 47 బీవీఎస్‌సీ, ఏహెచ్‌ కళాశాలలు నీట్‌ స్కోర్‌ను అనుమతిస్తున్నాయి. 

మరోవైపు.. ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్‌-2023 తేదీలను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్‌ పరీక్షలకు సంబంధించి రిజర్వ్‌ తేదీ జూన్‌ 1 నుంచి జూన్‌ 7 వరకు ఉంటాయని ప్రకటించింది ఎన్‌టీఏ.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చివ‌రి తేదీ ఇదే..

jee 2023

జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో ఉండగా, రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌ తొలి సెషన్‌ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. తొలి సెషన్‌ పరీక్షకు డిసెంబర్‌ 15 నుంచి జనవరి 12 రాత్రి 9గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 12 రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు విధించారు.

Published date : 16 Dec 2022 12:16PM

Photo Stories