వృత్తి నైపుణ్యాలకు ఎన్నో విలువైన మార్గాలు..
Sakshi Education
ప్రస్తుతం పరిశ్రమలో ఉన్నత స్థాయిలో వృత్తి నిపుణుల కొరత సమస్య లేదు. కానీ, పరిశ్రమ వర్గాలు దిగువ స్థాయిలో సరిపడినంత మంది వృత్తి నిపుణులు అందుబాటులో లేక ఇబ్బందిపడే పరిస్థితి ఉంది. దీనికి పరిష్కారంగా హయ్యర్ సెకండరీ, దాని దిగువ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులపై దృష్టిసారించాలని సూచిస్తున్న.. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మధు కణ్నన్‌తో గెస్ట్ కాలమ్...
ప్రస్తుతం దేశంలో అన్ని రంగాలు పురోగమనంలో సాగుతున్నాయి. ఇదే సమయంలో ఆయా రంగాల్లోని పరిశ్రమలకు భారీ సంఖ్యలో కింది స్థాయిలో వృత్తి నైపుణ్యాలు (ఒకేషనల్ స్కిల్స్) ఉన్న అభ్యర్థుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలుగా పేర్కొనే ఆటోమొబైల్, ప్రొడక్షన్ నుంచి ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వరకు వాస్తవ నైపుణ్యాలు, పరిశ్రమకు తగిన విధంగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.
ప్రొఫెషనల్ కోర్సులవైపు వెళ్లడమే కారణం
కింది స్థాయిలో వృత్తి నైపుణ్యాలున్న వారి కొరత ఏర్పడటానికి కారణం.. నేటి యువతలో అధిక శాతం మంది బీటెక్, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సుల దిశగా అడుగులు వేయడమే. దీంతో కింది స్థాయిలో పనులు నిర్వహించే అభ్యర్థులు దొరకడం లేదు. కానీ, సూపర్‌వైజరీ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల పరంగా ఉద్యోగాల కంటే ఎక్కువగా అభ్యర్థులు లభిస్తున్నారు.
అవగాహన లేక ఎందరో
వాస్తవానికి బీటెక్, ఎంబీఏ చదివే విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే వాటిలో చేరని విద్యార్థుల సంఖ్య మూడు, నాలుగింతలు ఎక్కువే. వారు భవిష్యత్తులో తమకు లభించే అవకాశాల గురించి ఆందోళన చెందుతుంటారు. వీరిని గుర్తించి ఒకేషనల్ స్కిల్స్‌లో శిక్షణనిప్పిస్తే వారి భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా పరిశ్రమ అవసరాలు కూడా తీరతాయి.
హైస్కూల్ స్థాయి నుంచి
హైస్కూల్ స్థాయి నుంచే ఒకేషనల్ స్కిల్స్‌ను పెంపొందించే చర్యలు అమలు చేస్తే సామాజిక - ఆర్థిక కోణాల్లో ఉన్నత విద్యనభ్యసించలేని విద్యార్థులకు అదే విధంగా వాస్తవ ఔత్సాహికులకు మేలు జరుగుతుంది. హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్థాయి కోర్సులు పూర్తయ్యేసరికి వారికి కెరీర్ భరోసా లభిస్తుంది. కేవలం ఉద్యోగం అనే కాకుండా స్వయం ఉపాధి దిశగా వెళ్లేందుకు తగిన ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
కంపెనీలు కూడా చొరవ చూపాలి
కింది స్థాయిలో ఒకేషనల్ స్కిల్స్ అవసరమైన సిబ్బంది కొరతను అధిగమించే క్రమంలో కంపెనీలు కూడా చొరవ చూపితే బాగుంటుంది. ఆయా సంస్థలు తమకు అవసరమైన విభాగాల్లో ఒకేషనల్ స్కిల్స్ అందించేలా ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అటు సంస్థకు, ఇటు అభ్యర్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే టాటా సంస్థ.. టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పింది. దీని ద్వారా హాస్పిటాలిటీ, ఆటో మొబైల్, బీపీవో, ఎలక్ట్రికల్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దే యత్నం చేస్తోంది.
ఎన్నో మార్గాలు
ఇప్పుడు ఆయా రంగాల్లో వృత్తి నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో విలువైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) చేపడుతున్న చర్యలు యువతకు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉన్నాయి. సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ పేరుతో ఆయా రంగాలకు సంబంధించి స్కిల్ ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న తరుణంలో వీటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.
ఉన్నత విద్యార్థులు ఇలా..
ఉన్నత స్థాయిలో అవసరాలకు ఉత్తీర్ణులు లభిస్తున్నారు. కానీ ఇదే సమయంలో జాబ్ స్కిల్స్ ఉండటం లేదనే అభిప్రాయం వాస్తవమే. విద్యార్థులు తొలి ఏడాది నుంచే తాము ఎంపిక చేసుకున్న బ్రాంచ్/ కోర్సుకు సంబంధించి రియల్ టైం నాలెడ్జ్ పెంచుకునేందుకు కృషి చేయా లి. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయ త్నించాలి. కేవలం క్లాస్‌రూం లెర్నింగ్‌కు పరిమితం కాకుండా పరిశ్రమలో మారుతున్న పరిస్థితులను నిరంతర అధ్యయనం చేయాలి. దీనికోసం ఇప్పు డు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. జర్నల్స్, ఇంటర్నెట్ రిసోర్సెస్, సెమినార్స్, వర్క్‌షాప్స్ ఇలా అపారమైన మార్గాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
స్వీయ స్థిరత్వమే రక్ష..
నేటి యువత స్వీయ స్థిరత్వాన్ని (సెల్ఫ్ సస్టెయినబిలిటీ)ని అలవర్చుకోవాలి. కేవలం లెక్చర్స్, ప్రొఫెసర్స్‌పై ఆధారపడకూడదు. సవాళ్లను స్వీకరించే స్వభావాన్ని అలవరచుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు అధిగమించే సంసిద్ధత లభిస్తుంది. నేటి పోటీ యుగంలో ఇతరులపై ఆధారపడదాం అనే ధోరణి సరికాదు. ఇది ఉద్యోగంలో చేరిన కొంతకాలం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కెరీర్ పరంగా స్వీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. కాబట్టి సెల్ఫ్ సస్టెయినబిలిటీ పొందితే కెరీర్ ఆసాంతం వెలుగులీనొచ్చు!!

Published date : 01 Aug 2016 02:42PM