న్యాక్ గుర్తింపుతో ప్రయోజనాలెన్నో..!
Sakshi Education
‘‘ఇన్‌స్టిట్యూట్‌లకు నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు చాలా అవసరం. దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఈ దిశగా కృషిచేయాలి.
ఫలితంగా కాలేజీలకు మంచి పేరు రావడంతోపాటు విద్యార్థులకూ నాణ్యమైన విద్య లభిస్తుంది’’ అంటున్నారు.. న్యాక్ ఇంచార్జ్ (యాక్టింగ్) డెరైక్టర్ ప్రొఫెసర్ లతాపిళ్లై. సైకాలజీలో డాక్టరేట్ పట్టా పొంది.. ఇగ్నో ప్రో-వీసీ, యూజీసీ డిప్యూటీ సెక్రటరీ, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ తదితర కీలక హోదాలు నిర్వహించడమే కాకుండా.. మహిళలు ఉన్నత విద్యలో రాణించే విధంగా పలు చర్యలు చేపట్టిన ప్రొఫెసర్ లతా పిళ్లైతో గెస్ట్ కాలం..
న్యాక్ గుర్తింపు వల్ల ఇన్‌స్టిట్యూట్‌లకు కలిగే ప్రధాన ప్రయోజనం.. యూజీసీ, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు లభిస్తాయి. ఫలితంగా ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది. జాతీయస్థాయిలోనూ సదరు ఇన్‌స్టిట్యూట్‌కు గుర్తింపు లభిస్తుంది. ప్రోత్సాహకాలు అందించే విషయంలో న్యాక్ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు కూడా న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే భవిష్యత్తులో వాటికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.
దరఖాస్తుకే వెనుకంజ :
దేశంలోని కొన్ని యూనివర్సిటీలు న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికే మొగ్గు చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో పూర్తిస్థాయి పరిపాలన విభాగాలు లేకపోవడమే. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఇన్‌స్టిట్యూట్‌కు హెడ్ లేకుండా న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి యూనివర్సిటీల్లో కీలక విభాగాల్లో నియామకాలు జరగాలి. దీనివల్ల కేవలం న్యాక్ కోణంలోనే కాకుండా.. సదరు యూనివర్సిటీల అకడమిక్ కార్యకలాపాల పరంగానూ పరిస్థితి మెరుగవుతుంది.
అందరికీ అందుబాటులో..
ఉన్నత విద్య అందరికీ అందుబాటులో తెచ్చేలా యూనివర్సిటీలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించాలి. తద్వారా అన్ని ప్రాంతాలు, నేపథ్యాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న యూనివర్సిటీల సంఖ్య నేటికీ వేళ్లమీద లెక్కించొచ్చు. మరోవైపు ప్రస్తుతం ఉన్నతవిద్యలో విద్యార్థినుల ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉండటం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. దీనికి ఆర్థిక, సామాజిక అంశాలు కారణమని చెప్పొచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా జండర్ డైవర్సిటీ విధానాన్ని అమలు చేస్తే ఉన్నతవిద్యలో విద్యార్థినుల సంఖ్యా పెరుగుతుంది.
దృక్పథం మారాలి..
ఉన్నతవిద్యపై విద్యార్థినుల దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థినులు ఇప్పటికీ కొన్ని కోర్సుల విషయంలో తాము రాణించలేమనే భావనతో ఉంటున్నారు. ఇది సరికాదు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో సైతం తమ నైపుణ్యాలతో ఉన్నత స్థానాలు అధిరోహించిన మహిళలు ఎందరో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేయాలి. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో వివక్ష చూపకుండా ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారికి ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుంది.
ఆసక్తి ప్రధానం..
ఉన్నతవిద్య పరంగా ఎటు వైపు అడుగులు వేయాలి? అనే విషయంలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తి, సామర్థ్యాలకు పెద్దపీట వేయాలి. దీనికి అనుగుణంగా సంబంధిత కోర్సులు అభ్యసించేలా వ్యవహరించాలి. ఫలితంగా భవిష్యత్తులో కెరీర్ పరంగా ఉన్నతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వీలవుతుంది!!

Published date : 02 Apr 2018 04:57PM