WIPRO: పాపం ఫ్రెషర్స్... ఏడాదికే సాగనంపిన విప్రో
Sakshi Education
కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరారు. దేశంలో పేరున్న కార్పొరేట్ కంపెనీ కదా అని సంబరపడ్డారు. ఇక జీవితం సెటిలైనట్లేనని కలలు కన్నారు. కానీ, వారి కలలు కన్నీరవడానికి ఎన్నో రోజులు పట్టలేదు.

ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో పనితీరు సరిగ్గా లేదనే కారణం చెప్పి సుమారు 800 మందిని వదిలించుకుంది విప్రో.
ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వందలమంది ఫ్రెషర్లకు షాకిచ్చింది. అంతర్గత పరీక్ష తర్వాత పేలవమైన పనితీరు కారణంగా 800 మంది ఫ్రెషర్స్‌ను తొలగించినట్లు బిజినెస్ టుడే రిపోర్ట్ చేసింది.
అంతేకాదు ఉద్యోగుల శిక్షణ నిమిత్తం ఖర్చుపెట్టిన రూ.75 వేలను అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుందని.. అయితే దాన్ని మాఫీ చేస్తున్నట్లు వారికి పంపిన టెర్మినేషన్ లెటర్‌లో పేర్కొంది. విప్రోలో పేలవమైన పనితీరు కారణంగా ఉద్యోగాలను కోల్పోయిన ఫ్రెషర్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను తొలగించేందుకు ఇదొక సాకు మాత్రమేనని... 2022, జనవరిలో ఆఫర్ లెటర్ ఇచ్చి, ఆన్‌బోర్డ్ చేశారనీ, ఇప్పుడు ఇంటర్నల్ పరీక్ష సాకుతో తమను ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని వాపోతున్నారు.
Published date : 20 Jan 2023 07:40PM