Skill Hub Center: శిక్షణతో ఉపాధి అవకాశం
సాక్షి ఎడ్యుకేషన్: రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ సెంటర్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ శివశశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ స్కిల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రధానమంత్రి కౌశిల్ వికాస్ యోజన ఆధ్వర్యంలో ఈ సెంటర్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వనరులు, డిమాండ్‌ను దృష్టింలో ఉంచుకొని, అందుకు తగిన విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Distance Education: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ కోర్సులు
మూడు నెలలు శిక్షణ ఇచ్చి, స్థానికంగా ఉన్న పరిశ్రమలు, ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. ఈనెల 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవెలపర్‌లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ ఆపై చదివిన విద్యార్థులు ( స్త్రీ /పురుషులు) అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం గణేష్: 9550104260/ సుజాత: 9177143181లకు ఫోన్ చేయాలని వివరించారు.