Job Mela : నేడు శ్రీకాకుళంలో జాబ్ మేళా.. పోస్టుల వివరాలు..
శ్రీకాకుళం: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం వేదికగా ఈనెల 23వ తేదీన జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. ఐఐఎఫ్‌ఎల్ సమస్త ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ రిలేషన్‌షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ క్రికెట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్‌మేళాను ఏర్పాటు చేశామన్నారు.
Intermediate Admission 2025 : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు ఆఖరి అవకాశాన్ని ఈనెల 31వ తేదీ వరకు
మొత్తం 180 ఖాళీలు ఉన్నాయని, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిన పురుషులు/స్త్రీలు అర్హులని అన్నా రు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో పనిచేయాల్సి ఉంటుందని కె.సుధ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు నెహ్రూ యువకేంద్రం వద్దకు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని కోరారు.
World's Oldest Person: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమెనే.. ఏ దేశానికి చెందిన మహిళంటే!