Skip to main content

Job Opportunities In India: ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి.. 2 లక్షల ఉద్యోగ అవకాశాలు!!

ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్‌ టెక్నాలజీ, డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ తెలిపింది.
Job opportunities growth   Spiritual tourism   Religious Tourism To Create Up To 2 Lakh Job Opportunities In 4 to 5 Years In India

భారత్‌లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్‌ అలుగ్‌ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది. 

2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్‌ మహమ్మారి తరువాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్‌ మందిర్‌తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్‌ నింపనుంది.

ఒక్క రామ్‌ మందిర్‌ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్, హౌజ్‌కీపింగ్, టూర్‌ గైడ్స్‌ వంటి సుమారు 25,000 జాబ్స్‌ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్‌ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్‌ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు.

Career opportunities: డేటా స్కిల్స్‌.. భలే డిమాండ్‌!

Published date : 23 Feb 2024 05:32PM

Photo Stories