Skip to main content

Training Centers: నిరుద్యోగులకు శిక్షణ కేంద్రాల కొరత

విద్యార్థులైనా, ఉద్యోగం కోసం ఎదుచూసే అభ్యర్థులైనా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు తగిన కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. సర్కారు కొలువు కొరకు ఈ విధమైన ఇబ్బందులను నిరుద్యోగలను అయోమయంలో పడేలా చేస్తున్నాయి..
Unemployed candidates studying in district library

జనగామ రూరల్‌: సర్కారు కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న నిరుపేద నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సరైన వనరులు లేకుండా పోయాయి. ప్రభుత్వం డీఎస్సీ, బీఎడ్‌ అభ్యర్థులకు, అలాగే గ్రూప్‌–1,2,3 తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి పరీక్ష తేదీలు ప్రకటించింది. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో నెలల తరబడి, కొందరు ఏళ్ల తరబడి సిద్ధమవుతున్నారు. ఇలా జిల్లాలో సుమారు 50 వేల మందికిపైగా ఉన్నారు.

National Women Championship: జాతీయ మహిళల హాకీ విజేత హరియాణా

అయితే ఉన్నత వర్గాలు, ఆర్థికంగా ఉన్నవారు హైదరాబాద్‌, హనుమకొండ తదితర ప్రాంతాల్లోని పైవేట్‌ కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ తరగతులు, స్టడీ సర్కిల్‌ వంటి సదుపాయం లేకపోవడంతో పేద, మధ్య తరగతి అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో ఇళ్ల వద్దే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరి కొంత మంది భారమైనా భవిష్యత్‌పై ఆశతో అప్పుచేసి కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారు.

DY Chandrachud: జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఇచ్చిన కీలక తీర్పులు ఇవే..

ఒక ఏడాదికే పరిమితం..

పోటీ పరీక్షల నేపథ్యంలో ఎస్సీ, బీసీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం ఉచిత శిక్షణ తరగుతులు నిర్వహించడానికి గత ఏడాది జిల్లా కేంద్రంలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. సుమారు 120 మందికి 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి సెంటర్‌ నిర్వహణ లేదు. ఈ ఏడాది ఉచిత శిక్షణ తరగుతులకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వా నించగా.. జనగామ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు హనుమకొండలో ఉన్న ఉమ్మడి జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో పరిమిత సీట్లు కేటాయించింది. అయితే జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉండడం, హనుమకొండ స్టడీ సర్కిల్‌లో అవకాశం లభించినా.. దూర భారం కారణంగా చాలా మంది ఆసక్తి చూపడంలేదు.

Free Education: ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

గతంలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో..

గతంలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘టెట్‌’ కోసం ప్రభుత్వం, ప్రైవేట్‌ శిక్షణ సంస్థలు జిల్లాలో తరగతులు ఏర్పాటు చేయలేదు. దీంతో నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని టీపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించారు.

గ్రంథాలయమే కోచింగ్‌ సెంటర్‌..

పోటీ పరీక్షల కోసం పేద అభ్యర్థులకు జిల్లా గ్రంథాలయమే కోచింగ్‌ సెంటర్‌గా మారింది. నిత్యం మూడు షిఫ్టుల్లో 200 నుంచి 300 మంది చదువుకుంటున్నారు. అయితే ప్రిపరేషన్‌ కోసం వచ్చే వారి సంఖ్య పెరగడంతో వారికి అవసరమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లు, దినపత్రికలు అందడంలేదు. వారు తెచ్చుకున్న మెటీరియల్‌తోనే ప్రిపేర్‌ అవుతున్నారు. మరికొందరు దాతల సహకారంతో గ్రూప్స్‌కు సంబంధించిన పుస్తకాలను సమకూర్చుకుని అవసరా లు తీర్చుకుంటున్నారు.

Credit Card: మహిళల ప్రత్యేక ప్రయోజనాల కోసం ‘దివా’ క్రెడిట్ కార్డును తెచ్చిన బ్యాంక్ ఇదే!!

కానిస్టేబుల్‌, ఎస్సై శిక్షణకూ అదే పరిస్థితి..

కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల కోసం జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలు లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తుండగా స్థానికంగా తగిన శిక్షణ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్‌ వంటి దూర ప్రాంతాలకు అభ్యర్థులు వెళ్తున్నారు.

10th SSC Examinations: జిల్లాల్లో ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు..

చదువు మీద దృష్టి పెట్టలేక పోతున్నా..

నేను ఎస్జీటీ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతున్నాను. జిల్లాలో శిక్షణ కేంద్రాలు లేక పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాను. ఇతర పనులకు వెళ్లాల్సి వస్తుండడంతో చదువు మీద దృష్టి సారించలేక పోతున్నాను. అందుకే జిల్లా గ్రంథాలయానికి వెళ్తున్నాను. స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

– భూక్య సంపత్‌, ఎస్జీటీ అభ్యర్థి

TS Inter Results: ‘స్పాట్‌’ కేంద్రాల్లోకి మొబైల్‌ నో.. ఈసారి ఫలితాలు ఇలా!

Published date : 26 Mar 2024 02:53PM

Photo Stories