10th SSC Examinations: జిల్లాల్లో ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు..
కోలారు: జిల్లా వ్యాప్తంగా 65 కేంద్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొదటి రోజున 171 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీడీపీఐ కృష్ణమూర్తి తెలిపారు. పరీక్షకు నమోదు చేసుకున్న 19,743 మందికిగాను 19,572 మంది హాజరై 171 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9.50 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు.
TS Inter Results: ‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో.. ఈసారి ఫలితాలు ఇలా!
విద్యా శాఖ మొదటి సారిగా ప్రతి పరీక్ష కేంద్రంలోను సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుండడం వల్ల ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూశారు. ఇంటర్ విద్యార్థులకు లేని వెబ్ కాస్టింగ్ పదో తరగతి పరీక్షలకు ఎందుకని విద్యార్థుల తల్లిదండ్రులు గుసగుసలాడారు. చిన్న లోపాలకు కూడా తావు లేకుండా పరీక్షలను సక్రమంగా నిర్వహించడంపై డీడీపీఐ సంతృప్తి వ్యక్తం చేశారు.
Puzzle of the Day (26.03.2024): Missing Number Puzzle
హొసపేటెలో..
నగరంలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రథమ భాష సబ్జెక్ట్‌కు విద్యార్థులు పరీక్ష రాశారు. విజయనగర జిల్లాలో 65 కేంద్రాల్లో 919 గదుల్లో 21,768 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 919 సీసీ కెమెరాలను ఏర్పాటుల చేశారు. అన్ని గదుల్లో సీసీటీవీ నిఘా, జీపీలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ సదాశివ ప్రభు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. గత ఏడాది 10వ తరగతి పరీక్షలో రాష్ట్రంలో 10వ స్థానం సాధించామని, ఈసారి ఇంకా మెరుగైన స్థానం సాధిస్తామని అంచనా వేస్తున్నామన్నారు. తరగతులలో మాస్ కాపీయింగ్ జరగకుండా డేగ కళ్లతో నిఘా వేశామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకుఎలాంటి అన్యాయం జరగకూడదన్నారు.
Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్కడే!
రాయచూరులో...
జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలి రోజున ప్రఽశాంతంగా జరిగాయి. సోమవారం టాగూర్ స్మారక ప్రౌఢశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్, జిల్లా ఎస్పీ నిఖిల్, డీడీపీఐ బడిగేర్, తాలూకా విద్యాశాఖాధికారులు చంద్రశేఖర్, సుఖదేవ్‌లు పరిశీలించారు. జిల్లాలో మొత్తం 110 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, 32,086 మంది విద్యార్థులకు గాను 814 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి బడిగేర్ తెలిపారు.
TS Inter Results: ‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో.. ఈసారి ఫలితాలు ఇలా!
10వ తరగతి పరీక్షలు షురూ
బళ్లారిటౌన్ జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజున జరిగిన కన్నడ భాష పరీక్షకు 21,461 మంది విద్యార్థులు పేరు నమోదు చేసుకోగా 265 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖాధికారిణి ఉమాదేవి తెలిపారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా పరీక్ష కేంద్రాల చుట్టు జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా భారీ భద్రత కల్పించారు. నగరంతో పాటు తాలూకాలోని మోకా గ్రామంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ కేంద్రాన్ని జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్, జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప పరిశీలించారు.
Goal Achievement: విద్య దీవెన పథకంతో కల సాకారమైంది
టెన్త్ పరీక్షలు రాసిన తల్లీకొడుకు
సాధారణంగా పిల్లలు 10వ తరగతి పరీక్ష రాస్తుంటే తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం వరకూ వస్తారు. కానీ రాష్ట్రంలో యాదగిరి జిల్లాలో కొడుకుతో పాటు తల్లి కూడా టెన్త్ పరీక్షలు రాసింది. సోమవారం రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ (టెన్త్) పరీక్షలు ప్రారంభమయ్యాయి. శహాపుర తాలూకా సగర హైస్కూల్ సెంటర్‌లో కొడుకు మల్లికార్జున (15)తో కలిసి తల్లి గంగమ్మ (34) ఒకే హాల్‌లో కూర్చుని పరీక్షలు రాశారు. తాను చిన్నప్పుడు చదువుకోలేకపోయానని, ఇప్పుడు ప్రైవేటుగా టెన్త్ చదువుతున్నానని ఆమె తెలిపింది. కనీసం పది పాసైతే అంగన్‌వాడీ ఉద్యోగమైనా వస్తుందని చెప్పింది.