Goal Achievement: విద్య దీవెన పథకంతో కల సాకారమైంది
![Young Man achieved his education goal due to AP Schemes Student benefiting from AP government education schemes](/sites/default/files/images/2024/03/26/goal-achievement-young-man-1711432899.jpg)
అనకాపల్లి: నా పేరున గోగాడ మోహన్‌కుమార్. తుమ్మపాల మండలం గురజాడనగర్‌లో ఉంటున్నాం. బీటెక్ మొదటి ఏడాది చదువుతున్నాను. మా నాన్న ఈశ్వరరావు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తారు. నాతో పాటు చెల్లి ఉంది. ఇద్దరిని చదివించలేక పదో తరగతి తరువాత ఒకరి చదువు ఆపేద్దామని నాన్న అనుకున్నారు. ఇంజినీరింగ్ చేయాలనేది నా కల. నాన్న నిర్ణయంతో అప్పుడు చాలా భయమేసింది. ఆ సమయంలో జగనన్న ప్రభుత్వం వచ్చి విద్యా దీవెన పథకం ప్రకటించింది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా డిప్లమాలో చేరాను.
Schemes for Students: విద్యార్థుల చదువుకు ఏపీ పథకాల అండ..
ప్రతి సెమిస్టర్‌కు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.25 వేల వరకు విద్యాదీవెన కింద నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం జమ చేసింది. ఈ నగదు కళాశాలకు కట్టి మూడేళ్ల డిప్లమా పూర్తిచేశాను. డిప్లమా మొత్తం రూ.75 వేలు అందాయి. ఈ ఏడాది బీటెక్‌లో జాయిన్ అయ్యాను. సీఎం జగన్ అందిస్తున్న విద్యాదీవెనతో ఇంజినీరింగ్ చేయాలనే నా కల నెరవేరుతుంది. చాలా సంతోషంగా ఉంది. నా చెల్లి కూడా ఈ ఏడాది డిప్లమాలో చేరింది. పదో తరగతి వరకు చెల్లికి అమ్మఒడి కూడా పడింది. మా సొంతూరు చీడికాడ మండలం పెదగోగాడ గ్రామం. గ్రామంలో వ్యవసాయ పనులు తప్ప మరే ఆధారం లేక పదేళ్ల క్రితం నాన్న ఇక్కడికి తీసుకొచ్చేశారు. జగనన్న పథకాలతో మా చదువులు సాఫీగా సాగుతున్నాయి.
Admissions 2024:గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Tags
- students goal
- Education Schemes
- AP government
- vidyadeevena
- Jagan government
- Poor Students
- Engineering
- financial schemes
- students education
- Education News
- Sakshi Education News
- EducationJourney
- APGovernmentSchemes
- anakapalli
- FinancialDifficulties
- EducationJourney
- HigherEducationOpportunity
- EducationalSuccess
- SakshiEducationUpdates