Job Fair: జాబ్ మేళాలో 91 మందికి ఉద్యోగాలు

స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు హాజరైన యువతీయువకులలో అటు కంపెనీలకు, ఇటు నిరుద్యోగులైన యువతకు అన్ని విధాలా కళాశాల యాజమాన్యం సహాయ సహకారాలను అందచేసింది. ఎంపికై న వారికి నియామక పత్రాలను కళాశాల ప్రిన్సిపాల్ టి.రాధాకృష్ణ అందచేశారు. పది కంపెనీలు ఎంపికలు చేపట్టగా 300 మంది వరకు నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఇటువంటి ఉద్యోగ మేళాలను తరచూ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాధాకృష్ణ తెలిపారు. ఎంపికై న వారిలో 32 మంది యువతులు, 59 మంది యువకులు ఉన్నారు. నవత రోడ్ ట్రాన్స్‌పోర్టు 13 మంది, అపోలో ఫార్మశీ 10 మంది, హెటెరో లేబ్ 14మంది, ముత్తూట్ ఫైనాన్స్ ముగ్గురు, హీరో మోటో కార్ప్ ఐదుగురు, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ 11మంది, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫర్ పాలిటెక్నిక్‌కు 30 మంది ఎంపికయ్యారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్ హెచ్.సుధీర్, సీనియర్ అధ్యాపకులు ఎస్‌ఎం.రఫీయుద్దీన్, వి.అప్పల నాయుడు, వి.రత్నభారతి, ఎన్.ఎస్.ఎస్. పివోలు బి.పిచ్చమ్మ, డి.మాల్యాద్రి, లక్ష్మీమంగమ్మ, ఐ.వి.వి.సత్యవతి, పిడి మూర్తి ల్గొన్నారు.
చదవండి: Job Mela: టీవీఎస్ ట్రైనింగ్, సర్వీసెస్ కంపెనీలో రేపు జాబ్‌మేళా