Job Mela: రాజాంలో నేడు జాబ్ మేళా..!
సాక్షి ఎడ్యుకేషన్: రాజాంలోని మండలసమాఖ్య కార్యాలయంలో ప్రొడక్షన్ కెమిస్ట్, సేల్స్ సూపర్‌వైజర్స్, సైట్ సూపర్‌వైజర్స్ పోస్టులకు సీడాప్, వెలుగు ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీఎం సీతారాం ఆదివారం తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రొడక్షన్ కెమిస్ట్‌కు బీఎస్సీ కెమిస్ట్రీ, బీజెడ్‌సీ పాస్ లేక ఫెయిల్, వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు, కలిగి ఉండాలి.
Intermediate Admissions: ఇంటర్మీడియట్ కళాశాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరంలో సేల్స్ సూపర్‌వైజర్స్ పోస్టులకు ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో చదివి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్‌లతో ఉదయం 10 గంటలకు రాజాంలోని వెలుగు కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.