Job Offer: ప్రభుత్వ జూనియర్ కళాశాలో జాబ్ మేళా..
Sakshi Education
నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. పూర్తి వివరాలను పరిశీలించండి.

సాక్షి ఎడ్యుకేషన్: పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి ఆర్.వహీదా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన శ్రీకృష్ణా ఫార్మసీ ముందుకు వచ్చిందని, వంద (100) ట్రైనీ ఖాళీల భర్తీ చేయనుందన్నారు.
Job Mela: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా
ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాబ్ సీకర్ లాగిన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికై న వారికి తొలుత వేతనం నెలకు రూ.15 వేలు చెల్లిస్తారని, 2019 నుంచి 2023 మధ్య బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు గల ఒరిజినల్స్, జెరాక్స్ కాపీ, ఫొటోలతో జాబ్‌మేళాకు హాజరుకావాలని ఆమె కోరారు.
Published date : 13 Feb 2024 02:39PM