TS SET: టీఎస్ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు... ఇప్పుడే అప్లై చేసుకోండి..!
రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియనుండగా.. దాన్ని సెప్టెంబర్ 4వరకు పొడిగించారు.
పరీక్ష ఫీజు: ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000.
చదవండి: NEET MBBS 2nd Phase Counsellingలో మిగిలిన సీట్లు ఇవే!
దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రూ.1500 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు గడువు: సెప్టెంబర్ 10, అలాగే రూ.2వేల ఆలస్య రుసుంతో దరఖాస్తుకు గడువు: సెప్టెంబర్ 18, రూ.3వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 20 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు http://telanganaset.org/index.htm ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
చదవండి: మరో 15 రోజుల వరకే ఫ్రీ... ఆధార్‌ను ఇలా ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి..!
ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.