TSSET Reschedule 2023 : టీఎస్ సెట్ రీషెడ్యూల్.. పరీక్ష తేదీ ఇదే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.
చదవండి: TSPSC Jobs Notification 2022: 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
మార్చి 10వ తేదీ నుంచి..
సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్) నిర్వహిస్తోంది.
టీఎస్ సెట్ సబ్జెక్ట్‌లు :
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్(పేపర్1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్-అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం-మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఇన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్.
టీఎస్ సెట్ పరీక్ష విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు-200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
TS EAMCET Exam Schedule 2023 : టీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..