TS SET 2023: టీఎస్‌సెట్–2023 నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీ అధ్యాపక ఉద్యోగాల అర్హత కోసం వీసీ రవీందర్ ఆధ్వర్యంలో ఓయూ రెండోసారి నిర్వహిస్తున్న స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు ఆగస్టు 5 నుంచి 29 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.1,500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 4 వరకు, రూ.2,000తో 9వ తేదీ వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
చదవండి: KGBV: నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా కేజీబీవీ.. బోధనలో ఠీవి
ఫీజు ఓసీలకు రూ.2,000, బీసీ/ఈబీసీలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో అక్టోబర్ 20, 28, 30 తేదీల్లో 29 సబ్జెక్టులకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.