Skip to main content

Tech Mahindra Free Job Training: నిరుద్యోగులకు 3నెలల ఉచిత శిక్షణ... అనంతరం ఉపాధి... చివరి తేదీ ఇదే!

టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ సహకారంతో నిర్మాణ్‌ సంస్థ ఉపాధి అవకాశాల కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ.
Tech Mahindra free job training

ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశం

టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ సహకారంతో నిర్మాణ్‌ సంస్థ ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ మయూర్‌ పట్నాల ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

3నెలల శిక్షణ అనంతరం ఉపాధి

టైపింగ్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, బేసిక్‌ అకౌంటింగ్‌ స్కిల్స్‌ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జాబీ జంక్షన్‌ ప్రాంతంలో ఉన్న నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ కేంద్రంలో గానీ, 9502874304, 9908104113 నెంబర్లకు ఈ నెల 15లోగా సంప్రదించాలని సూచించారు.

చదవండి: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ... తర్వాత జాబ్ కూడా... ఎక్కడంటే?

Published date : 11 Jul 2023 02:00PM

Photo Stories