Department of Education: ఎట్టకేలకు సమగ్ర శిక్ష అభియాన్ పోస్టుల భర్తీ
ఆదిలాబాద్‌టౌన్: విద్యాశాఖలో పెండింగ్‌లోని సమగ్రశిక్షా అభియాన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డాటా ఎంట్రీ ఆపరేటర్, సిస్టం ఎనాలసిస్ట్, ఎంఐ ఎస్ కో ఆర్డీనేటర్, అసిస్టెంట్ ప్రొగ్రాం ఆఫీసర్, ఇంక్లూసివ్ ఎడ్యూకేషన్ రిసోర్స్ పర్సన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2019 న వంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో దరఖాస్తులు స్వీకరించి రాత పరీక్ష కూడా నిర్వహించా రు. మెరిట్ జాబితాను సైతం ప్రకటించారు. రాష్ట్ర వి ద్యాశాఖ అనివార్య కారణాలతో ఈ నియమాక ప్రక్రియను నిలిపివేసింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ని ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయా అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ ఎస్పీడీ దేవసేన భర్తీకి అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి జూలై 13 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. గతంలో ఎంపికై నిరీక్షిస్తున్న వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
నేటి నుంచి ప్రక్రియ షురూ
ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా భర్తీ చేయనున్న ఈ పోస్టుల నియమాక ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13వరకు ప్రక్రియ నిర్వహిస్తారు. 30న డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల్లో మెరిట్ జాబితా, జూలై 1న సినియార్టీ జాబితా ప్రకటన, 3న ప్రొవిజనల్ లిస్టు ప్రకటన, 4, 5 తేదీల్లో అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ, 7న కేటగిరీ వారీగా తుది జాబితా విడుదల , 10న సర్టిఫికేట్ల పరిశీలన, నియమాక పత్రాలను అందజేయనున్నారు. ఎంపికై న అభ్యర్థులు 13వ తేదీలోగా సంబంధిత పోస్టుల్లో చేరాల్సి ఉంటుంది.
జిల్లా ఎంఐఎస్ కోఆర్డీనేటర్ డీఈవో సిస్టం అనాలిస్ట్ ఏపీవో ఐఈఆర్పీ
ఆదిలాబాద్ 05 07 00 01 11
నిర్మల్ 08 07 01 01 14
మంచిర్యాల 06 05 01 01 10
ఆసిఫాబాద్ 05 03 – 01 14