Skip to main content

Indian Railway Recruitment 2023 : ఇండియన్ రైల్వేలో 2,74,580 పోస్టులు.. ఈ ఉద్యోగాల భ‌ర్తీని త్వ‌ర‌లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : మొత్తానికి ఇండియ‌న్ రైల్వేలో 2.74 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Railway Recruitment 2023-24 Updates news Telugu
Railway Recruitment 2023-24 Jobs

మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ వివరంగా సమాధానమిచ్చింది. రైల్వే శాఖలో మొత్తంగా 2023 జూన్ నాటికి 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది.

☛ రైల్వేలో టెక్నిక‌ల్ కొలువులకు పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్

కేటగిరీకి సంబంధించిన ఖాళీలు ఇలా..

Railway Recruitment 2023 Details In Telugu

ఇందులో భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలు 1,77,924గా ఉన్నాయి. జూన్‌ 1 తేదీ నాటికి నాన్‌ గెజిటెడ్‌ గ్రూప్‌ సిలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే 8.04 లక్షల భర్తీ చేసినట్టు వివరించింది. భద్రత కేటగిరీలో లోకో పైలెట్లు, ట్రాక్‌ తనిఖీలు చేసే వ్యక్తులు, పాయింట్స్‌మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్‌ అసిస్టెంట్లు, ఇంజనీర్లు, ట్రైన్‌ మేనేజర్లు, స్టేషన్‌ మాస్టర్లు, టికెట్‌ కలెక్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఒడిశాలో బాలాసోర్‌ వద్ద ఘోరమైన రైలు ప్రమాదం నేపథ్యంలో ఆర్‌టీఐ కింద పోస్టుల ఖాళీలపై ఆర్‌టీఐ కింద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

☛ ఇండియ‌న్‌ రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాల‌కు .ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

రైల్వే మంత్రి చెప్పిన ప్ర‌కారం..

Union Railway Minister Ashwini Vaishnav news telugu

2022 డిసెంబర్ లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. ఇండియన్ రైల్వేస్ లో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ కు తెలియజేశారు. వీటిలో ముఖ్యంగా భద్రత విభాగంలో లోకో పైలట్లు, ట్రాక్ పర్సన్స్, పాయింట్స్ మెన్, ఎలక్ట్రీషియన్లు, ఇంజనీర్లు, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్లు, గార్డులు/ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, క్లర్క్స్, టికెట్ కలెక్టర్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమైన పోస్టులకు సంబంధించి సిబ్బంది కొరత ఉందని రైల్వే యూనియన్లు ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తున్నారు. 

rrb jobs 2023 telugu news

ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్ నెస్, సీనియర్, జూనియర్ సెక్షన్ ఇంజనీర్లు, గ్యాంగ్ మెన్, టెక్నీషియన్లు వంటి పోస్టుల కోసం రైల్వే యూనియన్లు మంత్రిత్వ శాఖను కోరాయి. ఈ సిబ్బంది కొరత కారణంగా పని ఒత్తిడి ఉన్న కార్మికులపై పడుతుందని.. ఒక్కో సిబ్బంది పట్టాలను తనిఖీ చేయడానికి 8 నుంచి 10 కి.మీ. నడుస్తున్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సమస్యను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పరిష్కరించేందుకు రైల్వే సంస్థ ప్రయత్నిస్తోంది. 2023 అక్టోబర్​ వరకు దాదాపు 1.52 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.38లక్షల మందికి నియామక పత్రాలు అందజేసినట్లు వారు వెల్లడించారు. అందులో 90వేల మంది విధుల్లో చేరారన్నారు. వీటిల్లో 90 శాతం ఉద్యోగాలు భద్రత విభాగంలో ఉన్నాయని అధికారులు వివరించారు. త్వరలోనే మిగిలిన‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

☛ రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

Published date : 30 Jun 2023 01:35PM

Photo Stories