ఇండియన్ రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాలకు .ప్రిపరేషన్ ప్లాన్
రాత పరీక్షలోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇస్తారు. తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కు ఉంటుంది. రాత పరీక్షలో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలో ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిషు, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. ఈ పరీక్షకు ముందు నుంచే పక్కాగా ప్రిపేర్ అయితే సులువుగా ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. విభాగాల వారీగా ప్రశ్నల సరళిని గమనిస్తే...
అర్థమెటిక్:
రాతపరీక్ష సిలబస్‌లో అత్యంత కీలకమైంది అర్థమెటిక్. ఇది నాన్-మ్యాథ్‌స విద్యార్థులకు కొంత కష్టంగా ఉండొచ్చు. కానీ 1 నుంచి 20 వరకు గుణకారాలు, 1 నుంచి 30 వరకు ఉన్న సంఖ్యల వర్గాలు, 1 నుంచి 10 వరకు అంకెల ఘనాలను నేర్చుకుంటే ఈ విభాగంలో సులువు గా రాణించడానికి అవకాశం ఉంటుంది.
ఈ విభాగంలో...
సంఖ్యలు, గసాభా- కసాగు, దశాంశ భిన్నాలు, సూక్ష్మీకరణలు, వర్గమూలాలు, ఘనమూలాలు, సరాసరి, వయసులు, సంఖ్యల మీద ప్రశ్నలు, నిష్పత్తి - అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభనష్టాలు, సరళవడ్డీ - చక్రవడ్డీ, మిశ్రమాలు, కాలం-పని, పంపులు-ట్యాంకులు, పనులు - వేతనాలు, కాలం -దూరం, రైళ్లు, పడవలు-ప్రవాహాలు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు... ముఖ్యమైనవి. వీటితోపాటు పదో తరగతి వరకు గణిత శాస్త్ర పాఠ్య పుస్తకాలను అభ్యసించాలి.
రీజనింగ్:
రాత పరీక్షలో మరో ముఖ్యమైన విభాగం... రీజనింగ్. ఇందులో వెర్బల్, నాన్-వెర్బల్, లాజికల్ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలుంటాయి.
ఈ విభాగంలో..
డెరైక్షన్ టెస్ట్, రక్త సంబంధాలు, క్యాలెండర్స్, క్లాక్స్, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్నమైన దాన్ని గుర్తించడం, లెటర్ సిరీస్, ర్యాంకింగ్ పరీక్ష, గణిత గుర్తుల పరీక్ష, కోడింగ్-డీకోడింగ్, పజిల్ టెస్ట్, పాచికలు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, వెన్ డయాగ్రమ్స్, నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్‌లు ముఖ్యమైనవి.
జనరల్ స్టడీస్:
రాత పరీక్షలో కీలకమైన విభాగం... జనరల్ స్టడీస్. ఇందులో జీకే (జనరల్ నాలెడ్జ్), కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, జనరల్ సైన్స్, పాలిటీ, చరిత్ర మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఈ విభాగంలో..
ఐక్యరాజ్య సమితి, భారతదేశ ప్రథములు, ప్రపంచ ప్రథములు, ప్రపంచంలో సర్వోత్తమమైనవి, భారతదేశంలో సర్వోత్తమమైనవి, ముఖ్యమైన తేదీలు, జాతీయ చిహ్నాలు, జనాభా లెక్కలు, సరిహద్దులు, ఎయిర్ లైన్స్, పార్లమెంట్, క్రీడారంగం, భారత రాజ్యాంగం, రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థలు- నెలకొన్న ప్రదేశాలు, ముఖ్యమైన ఆపరేషన్‌లు, ప్రపంచ సాంస్కృతిక స్థలాలు, వింతలు, దేశాలు - కరెన్సీలు- రాజధానులు, సమాచార రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్-సైన్స్ మొదలైనవి కీలకమైనవి. ఈ విభాగం కోసం ఇయర్ బుక్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ బుక్స్‌తోపాటు ప్రముఖ దినపత్రికలను శ్రద్ధగా చదవాలి.
ప్రిపరేషన్‌లో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్‌లను ప్రణాళిక ప్రకారం చదవాలి. చాప్టర్‌ల వారీగా తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవాలి. సిలబస్ చదవడం పూర్తయిన తర్వాత గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. నమూనా ఓఎంఆర్ షీట్‌లను ఉపయోగించి టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయడం మంచిది. టెస్ట్ రాసిన తర్వాత తప్పొప్పులను సరిచూసుకోవాలి. ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని అందు కు అనుగుణంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
రిఫరెన్స్ బుక్స్:
ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్:ఎస్ ఎల్ గులాటీ, ఆర్.ఎస్ అగర్వాల్
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్: దిల్షాన్ పబ్లికేషన్స్
నాన్ వెర్బల్ రీజనింగ్ : ప్రభాత్ జావేద్
వెర్బల్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్
జనరల్ సైన్స్: పదోతరగతి వరకు తెలుగు అకాడమీ పుస్తకాలు, 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు.
కరెంట్‌అఫైర్స్: ఏదైనా తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు, ఇండియా ఇయర్ బుక్, సాక్షి భవితలో వచ్చే కరెంట్ అఫైర్స్ మొదలైనవి.
జనరల్ నాలెడ్జ్: sakshieducation.com
Useful Study Material
http://www.sakshieducation.com/GroupII/GroupIIStory.aspx?nid=45120