Skip to main content

రైల్వేలో టెక్నిక‌ల్ కొలువులకు పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్

ఇండియన్ రైల్వేలో కెరీర్‌ను సుస్థిరం చేసుకునే దిశగా ఆలోచిస్తున్న వారికి ఓ మంచి అవకాశం.

పదో తరగతితో పాటు ఐటీఐ/ట్రేడ్ అప్రెంటీస్‌షిప్/ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్) అర్హతతో...టెక్నిక‌ల్ కొలువుల‌ను చేజిక్కించుకోవచ్చు.ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, అందులో విజయానికి సూచనలు..

పరీక్ష విధానం :
ఏఎల్‌పీ/టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది. ఏఎల్‌పీ పోస్టుకు పోటీపడుతూ, రెండో దశ సీబీటీలో అర్హత సాధించిన వారికి అదనంగా కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏటీ) నిర్వహిస్తారు.

తొలిదశ సీబీటీ ప్రశ్నపత్రంలో 75 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి గంట. మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; జనరల్ సైన్స్; జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. తొలిదశలో అర్హత సాధించిన వారికి రెండోదశ సీబీటీ నిర్వహిస్తారు.
రెండోదశ పరీక్షలో పార్ట్-ఏ (100 ప్రశ్నలు, 90 నిమిషాలు), పార్ట్-బీ (75 ప్రశ్నలు, 60 నిమిషాలు) ఉంటాయి.
పార్ట్-ఏలో మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బీ (అర్హత పరీక్ష మాత్రమే)లో సంబంధిత ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
సన్నద్ధత..

మ్యాథమెటిక్స్ :
మ్యాథమెటిక్స్ సిలబస్‌లో నంబర్ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్; రేషియో అండ్ ప్రపోర్షన్; పర్సంటేజెస్, మెన్సురేషన్; టైం అండ్ వర్క్; టైం అండ్ డిస్టెన్స్; ఇంట్రస్ట్; ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, కేలండర్ అండ్ క్లాక్ తదితర అంశాలున్నాయి.
తొలుత పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లో ఉన్న సిలబస్‌లోని అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఉదాహరణ, అభ్యాసాల్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
ఆర్.ఎస్.అగర్వాల్, అరిహంత్ పుస్తకాల్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. మ్యాథ్స్ లో అధిక మార్కుల సాధనకు ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదని గుర్తించాలి.
Ex:
1. A person scores 45% of the total marks in the exam and still fails by 40 marks. The passing percentage of the exam is 55 %. What is the maximum marks of the exam?
1) 300
2) 350
3) 400
4) 500
Ans: 3

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ :
సిలబస్‌లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, జంబ్లింగ్, వెన్‌డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, సఫీషియెన్సీ; కన్‌క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్; సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్; అనలిటికల్ రీజనింగ్; క్లాసిఫికేషన్; డెరైక్షన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ తదితర పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఈ విభాగం నుంచి వాటిలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఆపై ప్రామాణిక పుస్తకాల్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలుంటాయి. షార్ట్‌కట్స్ ద్వారా త్వరగా సమాధానాలు గుర్తించేలా రోజూ 20-30 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
Ex:
1. A and B are sisters, R and S are brothers. A's daughter is R's sister. What is B's relation to S?
1) Mother
2) Grandmother
3) Sister
4) Aunt
Ans: 4

జనరల్ సైన్స్ :

  • పదో తరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సెన్సైస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ/ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఉపయోగించుకోవాలి.
  • ఫిజిక్స్‌లో యూనిట్స్, ఫోర్స్, ప్రెజర్; మెకానిక్స్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, మోడర్న్ ఫిజిక్స్ తదితర అంశాల్లోని బేసిక్ కాన్సెప్టులు, సూత్రాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • కెమిస్ట్రీలో ఆటమ్స్, మాలిక్యూల్స్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్; మెటల్స్ అండ్ నాన్ మెటల్స్; కార్బన్ కాంపౌండ్స్, మెటలర్జీ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
  • లైఫ్ సెన్సైస్‌కు సంబంధించి హ్యూమన్ బాడీ, విటమిన్లు, న్యూట్రిషన్, నెర్వస్ సిస్టమ్, హార్మోన్లు, ఎంజైమ్‌లు, సూక్ష్మజీవులు, వ్యాధులు, టీకాలు, పర్యావరణం తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
  • జనరల్ సైన్స్‌కు సంబంధించి రోజువారీ జీవితంలోని అనువర్తనాలు, స్పేస్ సైన్స్, కంప్యూటర్స్ తదితరాలపై అవగాహన తప్పనిసరి.

Ex:
Which of the following bones is not found in human leg?

1) Tibia
2) Humerus
3) Femur
4) Fibula
Ans: 2

జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ :
రోజూ తనచుట్టూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యాంశాలను తెలుసుకోవాలి. భారత జాతీయోద్యమంలోని ముఖ్య పరిణామాలపై అవగాహన అవసరం. పాలిటీలో రాజ్యాంగం ముఖ్యాంశాలపై దృష్టిసారించాలి.
కరెంట్ అఫైర్స్‌లో జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలను తెలుసుకోవాలి. సదస్సులు, క్రీడలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, అంతరిక్ష ప్రయోగాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు తదితరాలపై దృష్టిసారించాలి. దినపత్రికలను చదువుతూ ముఖ్య సంఘటనలను ప్రత్యేకంగా నోట్‌్నలో పొందుపరచుకోవడం మంచిది.

బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ :
ఇంజనీరింగ్ డ్రాయింగ్ (ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లైన్స్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రెజెంటేషన్స్), యూనిట్స్, మెజర్‌మెంట్స్; మాస్ వెయిట్ అండ్ డెన్సిటీ; వర్క్ పవర్ అండ్ ఎనర్జీ; స్పీడ్ అండ్ వెలాసిటీ; హీట్ అండ్ టెంపరేచర్; బేసిక్ ఎలక్ట్రిసిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

టిప్స్..

  • సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. రోజుకు 8-10 గంటలను ప్రిపరేషన్‌కు కేటాయించాలి. అన్ని సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన అంశాలు, సూత్రాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వీటిని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలి.
  • ఒక్కో అంశానికి సంబంధించి 100-200 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం మంచిది.
  • ప్రిపరేషన్ సమయంలో ఎదురయ్యే సందేహాలను ఎప్పటికప్పుడు స్నేహితులు, ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
  • మోడల్ పేపర్లు, పాత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలకు నిర్దేశిత సమయంలో సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.
Published date : 25 Jun 2020 02:12PM

Photo Stories