Microsoft layoffs: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ భారీ షాక్... ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తీసివేత.. ఈ సారి ఎంతమందినంటే...
ఈ ఏడాది జనవరిలో 10 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి అదనంగా మరిన్ని కోతలకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది.
తాజా తొలగింపుల్లో భాగంగా వాషింగ్టన్ కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మందిని తగ్గించుకుంది. అందులో 66 మంది వర్చువల్‌గా పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరిలో సేల్స్, కస్టమర్ సక్సెస్ రిప్రజెంటేటివ్స్ తాము ఉద్యోగాలు కోల్పోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్‌లు తీసుకొచ్చిన్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇంకా పెద్దఎత్తున ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని తాజగా ప్రకటించింది. అయితే ఎంతమందిని సాగనంపేది మాత్రం వెల్లడించలేదు.
Daily Current Affairs in Telugu: 11 జులై 2023 కరెంట్ అఫైర్స్
ఇప్పటికే అమెజాన్, గూగుల్, ట్విటర్, మెటా(ఫేస్‌బుక్)తో పాటు ప్రముఖ టెక్ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో ఎదురైన పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలతో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.