Skip to main content

Mckinsey Report: 2030 నాటికి జాబ్‌ మార్కెట్‌ షేక్‌.. కలవరపెడుతున్న రిపోర్ట్‌

Mckinsey Report   Career transitions due to AI  Employment impact

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.

మెకిన్సే సీనియర్ పార్ట్‌నర్‌, దాని గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్‌గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.

NEET 2024: నీట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి.. ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ

ప్రభావిత‍మయ్యే రంగాలు ఇవే..
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావిత ఉద్యోగ మార్పులు  ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెన్స్‌, కస్టమర్ సర్వీస్ అండ్‌ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్‌ ప్రొడక్షన్‌, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్‌, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్‌గ్రుడ్ పేర్కొన్నారు.

ఈ విధులు ఆటోమేషన్‌కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.

TSPSC Group I Exam: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ.. ఈ పరీక్ష ఉన్నందున వాయిదా వేయాలన్న పిటిషనర్లు!

ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్‌గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్‌ థింకింగ్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు.

Published date : 05 Jun 2024 04:43PM

Photo Stories