ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వైఎస్‌ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడు గౌతం ప్రసాద్ నింబూరి డిమాండ్‌చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా గౌతం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 9ఏళ్లు పూర్తి కావస్తోందని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, లేకపోతే నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు తిరుపతిరెడ్డి, బుస్సాపూర్ శంకర్, నాయకులు మోహన్, లావణ్య, దినేష్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.