Job Mela: జాబ్‌ఫెయిర్‌లో 108 మందికి ఉద్యోగాలు
కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ ఫెయిర్‌ను కళాశాల ప్రిన్సిసాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి ప్రారంభించారు. విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నిర్ధేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుకుంటుండగానే ఉపాధి కల్పించేందుకు జేకేసీ కృషి చేస్తుందని.. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన తొమ్మిది ప్రభుత్వ కళాశాలలు, మొవ్వ, పామర్రు, అవనిగడ్డ, బంటుమిల్లి, తిరువూరు, మైలవరం, కంచికచర్ల తదితర కళాశాలకు చెందిన మొత్తం 475 మంది విద్యార్థులు జాబ్‌ఫెయిర్‌కు హాజరయ్యారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత 108 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీసీఈ ఓఎస్‌డీ రమేష్, మీరావళి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఏ ఆశీర్వాదం జేకేసీ నుంచి డి. సురేష్, పలు కళాశాలల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
చదవండి: Mega Job Mela: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 7న మెగా జాబ్‌మేళా..