Backlog jobs: బ్యాక్‌లాగ్ ఉద్యోగాల ప్రొవిజినల్ జాబితా విడుదల
Sakshi Education
మహారాణిపేట: దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను https://visakhapatnam.ap.gov.in/ లో పొందుపరిచినట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జె.మాధవి తెలిపారు. 2021–22లో 9 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రస్తుతం 5 పోస్టులకు మాత్రమే 1ః3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల అర్హతలను పరిశీలించిన తర్వాత ప్రకటించిన ఖాళీల మేరకు మాత్రమే తుది ఎంపిక జరుగుతుందన్నారు. బయట వ్యక్తుల మోసపూరితమైన మాటలు విని మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. మరిన్ని వివరాలకు 0891–2952585ను సంప్రదించవచ్చు.
Published date : 21 Jul 2023 07:03PM