IBPS Clerk: బ్యాంకు జాబ్ రావాలంటే... ఈ స్కోరు ఉండాల్సిందే.. నూతన నిబంధనపై అభ్యర్థుల ఫైర్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే పరీక్షలో మెరిట్ మార్కులు సాధిస్తేనే బ్యాంకు ఉద్యోగం వచ్చేది. అయితే తాజా నిబంధనలోనూ స్కోర్ ఉంటేనే జాబ్ వస్తుంది. స్కోర్ అంటే పరీక్షల్లో వచ్చిన మార్కులు కాదు.. సిబిల్ స్కోర్.
ఐబీపీఎస్ ఇటీవల విడుదల చేసిన భారీ క్లరికల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో అభ్యర్థులు ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండాలని, ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ముందు కనీసం 650 సిబిల్ స్కోర్ కలిగి ఉండాలని పేర్కొంది. అయితే బ్యాంకు ఖాతా లేని అభ్యర్థులు తమ సిబిల్ స్టేటస్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని ది హిందూ పత్రిక నివేదించింది.
IBPS 2023: డిగ్రీ అర్హతతో 4,545 బ్యాంకు క్లర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే నాటికి సిబిల్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయించుకోవాలి లేదా ప్రతికూలంగా ప్రతిబింబించే అకౌంట్లకు సంబంధించి ఎటువంటి బాకీ లేదని బ్యాంకు, రుణదాత నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. సిబిల్ విఫలమైతే, అర్హత ప్రమాణాల మేరకు ఆఫర్ లెటర్‌ను ఉపసంహరిస్తామని, లేదా రద్దు చేస్తామని ఐబీపీఎస్ పేర్కొంది. ఈ నిబంధనపై అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
Central Bank of India: డిగ్రీ అర్హతతో 1000 మేనేజర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
సిబిల్ స్కోర్ అంటే..
సిబిల్ నివేదిక అనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాల వివరాలకు సంబంధించిన ఆర్థిక నివేదిక. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ అనేది వారి క్రెడిట్ హిస్టరీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ ఆధారంగా లెక్కిస్తారు.
కాగా ఐబీపీఎస్ ఈ సంవత్సరం 4,045 క్లరికల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత మళ్లీ 500 పోస్టులను అదనంగా చేర్చింది. అంటే మొత్తం 4,545 ఖాళీలకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 1న ప్రారంభమైన దరఖాస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూలై 21న ముగియనుంది.