IBM CEO Arvind Krishna: ఏఐతో ఉద్యోగాలకు ముప్పే... ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ కీలక వ్యాఖ్యలు

చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: బెంగళూరు యువతి చేస్తున్న పనికి మంత్రముగ్ధులైన గేట్స్... ఎందుకంటే..!
సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీ మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంలో తోడ్పడగలవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్‌ఎక్స్ అనే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ సూట్‌ను పరిచయం చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు గడ్డురోజులే... రెండేళ్లలో ప్రోగ్రామర్ల ఉద్యోగాలకే ఎసరు..!
అలాగే ఈ ఏడాది మేలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోనూ అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగించనుందని ఉద్యోగులు ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు.