Skip to main content

JEE Advanced 2022 Top 10 Rankers : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంక‌ర్లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022 ఫలితాలను పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై సెప్టెంబ‌ర్ 11వ తేదీ (ఆదివారం) ప్రకటించింది.

ఫలితాలతోపాటే తుది ఆన్సర్‌ 'కీ', మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయ ఆరో ర్యాంకు సాధించింది. అభ్యర్థులు స్కోర్‌ కార్డులను jeeadv.ac.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాలను రిజర్వేషన్ల వారీగా ఆయా వర్గాల కోటా ప్రకారం విడుదల చేశారు.

చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

JEE Advanced Result 2022 : How To Download Scorecard
➤ Visit the official website https://jeeadv.ac.in/
➤ Click on JEE Advanced 2022 result link
➤ Insert login credentials- JEE Advanced registration number and date of birth
➤ Click on submit
➤ Download JEE Advanced 2022 scorecard, take a print out for further reference.

సెప్టెంబ‌ర్ 12వ తేదీ నుంచి..
ఇక జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. సెప్టెంబ‌ర్ 12వ తేదీ నుంచి ‘జోసా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్టీఐలలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తాయి.

చదవండి: Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

సీట్ల వివరాలు ఇవే..
దేశ‌వ్యాప్తంగా 23 ఐఐటీలలో 16,598 సీట్లు, 31 ఎన్‌ఐటీలలో 23,994, 26 ఐఐఐటీలలో 7,126, 33 జీఎఫ్టీఐలలో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నట్లు ‘జోసా’ సీట్ల వివరాలను విడుదల చేసింది.

వాటిలోనే మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీ­­లలో 1,567, ఎన్‌ఐటీలలో 749, ఐఐఐటీలలో 625, జీఎఫ్టీఐ­లలో 30 సీట్లు మహిళలకు సూపర్‌ న్యూమరరీ కోటా కింద రానున్నా­యి. ఆర్కిటెక్చర్‌ కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 14న ఏఏటీ పరీక్షను నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు.

చదవండి: ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు

టాప్-10 ర్యాంకర్లు వీరే..
టాప్-10 ర్యాంకులను సాధించిన విద్యార్థుల జాబితాలో ఆర్ కే శిశిర్ అగ్రస్థానంలో ఉన్నారు. పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. థామస్ బిజు చీరంవెళిల్ మూడోస్థానాన్ని సాధించారు. వంగపల్లి సాయి సిద్ధార్థ్-4, మయాంక్ మొత్వాని-5, పోలిశెట్టి కార్తికేయ-6, ప్రతీక్ సాహు-7, ధీరజ్ కురుకుంద-8, మహిత్ గఢివాలా-9, వెచ్చ జ్ఞాన మహేష్-10వ స్థానంలో నిలిచారు. తొలి 10 మందిలో నలుగురు తెలుగువారే.

Jee Advanced 2022: ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం

Published date : 11 Sep 2022 06:02PM

Photo Stories