ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు (జేఈఈ మెయిన్ 2015)
ఫస్ట్ ఆప్షన్‌గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్:
జేఈఈ మెయిన్ ర్యాంకర్లలో అధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును ఎంపిక చేసుకోవడానికే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీ నుంచి రిజర్వ్‌డ్ కేటగిరీ వరకు అన్ని వర్గాల విద్యార్థులు సీఎస్‌ఈ/సీఈ బ్రాంచ్‌కే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కారణం.. ఈ బ్రాంచ్‌కు ఉన్న మార్కెట్ డిమాండ్, భవిష్యత్తు అవకాశాలే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, అప్లికేషన్ వంటి విభాగాల్లో అద్భుత అవకాశాలు లభిస్తాయి. అందుకే ఈ బ్రాంచ్‌ను కొత్తగా ఏర్పాటైన నిట్‌లు సైతం అందిస్తున్నాయి.
నెక్స్ట్.. ఈసీఈ:
సీఎస్‌ఈ తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్న బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. గత ఏడాది గణాంకాలే ఇందుకు నిదర్శనం. అయితే కొన్ని నిట్‌ల విషయంలో అభ్యర్థులు రవాణా, ఇతర మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని ఈసీఈకి తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్రాంచ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇటు టెలికాం సంస్థలు, అటు సాఫ్ట్‌వేర్ సంస్థలు, కోర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థలు.. ఇలా భిన్న రంగాల్లో అవకాశాలు లభిస్తాయి.
మూడో ప్రాధాన్యం ఈఈఈ:
నిట్ ఔత్సాహిక విద్యార్థుల్లో మూడో ప్రాధాన్యంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నిలుస్తోంది. ఈ బ్రాంచ్ పూర్తి చేసిన విద్యార్థులకు విద్యుదుత్పత్తి సంస్థలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థలు, మౌలిక రంగ పరిశ్రమలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ భవిష్యత్తు అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే అంచనాలే ఇందుకు కారణం.
సివిల్.. పూర్వ వైభవం:
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సివిల్ ఇంజనీరింగ్ కూడా పూర్వ వైభవం పొందుతోంది. నిట్ క్యాంపస్‌లలో సివిల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. రవాణా, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, పథకాల కారణంగా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే అంచనాలే విద్యార్థులను ఈ దిశగా నడిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఉన్నత విద్య కోణంలోనూ సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు సరితూగే విధంగా ఎంటెక్‌లో భిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇది కూడా బీటెక్ స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ పట్ల ప్రాధాన్యం పెరగడానికి కారణంగా పేర్కొనొచ్చు.
మెకానికల్.. పెరుగుతున్న ఆసక్తి:
జేఈఈ మెయిన్ ర్యాంకర్ల బ్రాంచ్ ఎంపిక పరంగా ఆదరణ పొందుతున్న మరో కోర్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరిస్తుండటం, ఉత్పత్తి రంగంలోనూ కొత్త పరిశ్రమల ఏర్పాటు పెరుగుతుండటం మెకానికల్ బ్రాంచ్ వెలుగులీనడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే విద్యార్థుల్లోనూ ఈ బ్రాంచ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. నిట్ వరంగల్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి (త్రిచీ)లలో 500 నుంచి 600లోపు ర్యాంకులు ఓపెనింగ్ ర్యాంకులుగా నమోదవడమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద సీఎస్‌ఈ, ఈసీసీ, ఈఈఈ, సివిల్, మెకానికల్ ఈ అయిదు బ్రాంచ్‌లు ఎవర్‌గ్రీన్ బ్రాంచ్‌లుగా విద్యార్థుల్లో క్రేజ్ నింపుతూ సీట్ల భర్తీ, ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల పరంగానూ ఇతర బ్రాంచ్‌లతో పోల్చితే ముందంజలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జాతీయ స్థాయిలో ఉన్న నిట్‌లలో ఓపెన్ కేటగిరీలో ఈ అయిదు బ్రాంచ్‌లలో నమోదైన ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకుల వివరాలను పట్టికలో చూడొచ్చు.
గమనిక: నాలుగు రౌండ్లుగా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఫస్ట్ రౌండ్‌లోని ఓపెనింగ్ ర్యాంకును; నాలుగో రౌండ్‌లోని క్లోజింగ్ ర్యాంకును ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులుగా గుర్తించడం జరిగింది. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌కు ఆ ఇన్‌స్టిట్యూట్ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు హోం స్టేట్ కోటా కింద అందుబాటులో ఉంటాయి. ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా అదర్ స్టేట్ కోటా కింద భర్తీ చేసిన సీట్లు, వాటికి సంబంధించి ఓపెనింగ్-క్లోజింగ్ ర్యాంకులు ఇవి. గత ఏడాది కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో సీట్లు మిగిలిన కారణంగా స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్‌ను కూడా నిర్వహించారు.
నిట్ - వరంగల్‌లో ట్రెండ్ ఇలా:
తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - వరంగల్ క్యాంపస్ కూడా ఔత్సాహిక విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోందని గత ఏడాది ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 50 శాతం హోం స్టేట్ కోటా కింద తెలంగాణ విద్యార్థులకు లభించే సీట్లతోపాటు అదర్ స్టేట్ కోటాలో లభించే సీట్లకు సైతం బెస్ట్ ర్యాంకర్లు పోటీ పడినట్లు స్పష్టమవుతోంది. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా నిట్- వరంగల్ క్యాంపస్‌లో అందుబాటులో ఉన్న బ్రాంచ్‌లలో హోం స్టేట్, అదర్ స్టేట్ కోటా పరిధిలో ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంకుల వివరాలు..
బ్రాంచ్ | హోం స్టేట్ | అదర్ స్టేట్ | ||
| ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ |
సీఎస్‌ఈ | 293 | 1188 | 56 | 1896 |
ఈసీఈ | 367 | 1761 | 1063 | 3567 |
ఈఈఈ | 2052 | 2969 | 1347 | 5168 |
మెకానికల్ | 460 | 2977 | 586 | 4566 |
సివిల్ | 2337 | 4285 | 3393 | 8958 |
మెటలర్జికల్ | 9900 | 11739 | 8740 | 17125 |
కెమికల్ | 4394 | 7197 | 3314 | 12908 |
బయోటెక్నాలజీ | 7728 | 16416 | 7342 | 20735 |
నిట్ - ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఈదే హవా:
గత ఏడాది నుంచే ప్రారంభమైన నిట్ - ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటు హోం స్టేట్ కోటా, అటు అదర్ స్టేట్ కోటాలో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల సీట్లే ముందుగా భర్తీ అయ్యాయి. కొత్త ఇన్‌స్టిట్యూట్ అయినప్పటికీ ఓపెనింగ్ ర్యాంకులను పరిశీలిస్తే కోర్ బ్రాంచ్‌ల్లో జాతీయ స్థాయిలో 15 వేల ర్యాంకులలోపు అభ్యర్థులు ఈ క్యాంపస్‌ను ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించి బ్రాంచ్‌ల వారీగా వివరాలు..
బ్రాంచ్ | హోం స్టేట్ | అదర్ స్టేట్ | ||
| ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ |
సీఎస్‌ఈ | 2546 | 10930 | 1345 | 13632 |
ఈసీఈ | 3391 | 13927 | 7726 | 16406 |
ఈఈఈ | 7864 | 18179 | 12022 | 23281 |
మెకానికల్ | 11298 | 18356 | 3335 | 20558 |
సివిల్ | 10024 | 21261 | 12760 | 25495 |
మెటలర్జికల్ | 19663 | 31986 | 19388 | 33652 |
కెమికల్ | 10480 | 26817 | 15942 | 26253 |
బయోటెక్నాలజీ | 20288 | 37758 | 20230 | 34930 |
గత ఏడాది ఎన్‌ఐటీల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకుల వివరాలు (ఓపెన్ కేటగిరీ)
ఎన్‌ఐటీ | బ్రాంచ్‌లు | |||||||||
| సీఎస్‌ఈ | ఈసీఈ | ఈఈ/ఈఈఈ | సివిల్ | మెకానికల్ | |||||
| ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ | ఓఆర్ | సీఆర్ |
భోపాల్ | 2284 | 7436 | 5170 | 9222 | 7047 | 11490 | 9064 | 14094 | 5756 | 11077 |
జైపూర్ | 732 | 4860 | 1992 | 7735 | 3597 | 9926 | 7521 | 13834 | 3652 | 7819 |
అలహాబాద్ | 1043 | 3330 | 2556 | 5715 | 3531 | 7805 | 5727 | 11844 | 3000 | 6156 |
అగర్తల | 9140 | 24356 | 14477 | 27544 | 16041 | 28650 | 15421 | 32354 | 10348 | 25385 |
కాలికట్ | 1295 | 3422 | 2457 | 4106 | 3650 | 6668 | 6420 | 11121 | 3246 | 5947 |
ఢిల్లీ | 1069 | 4588 | 1640 | 5616 | 4486 | 9158 | - | - | - | - |
దుర్గాపూర్ | 4385 | 11202 | 5260 | 12637 | 7941 | 14654 | 11553 | 15884 | 7508 | 13260 |
గోవా | 4113 | 11341 | 7599 | 13158 | 9755 | 14758 | - | - | - | - |
హమీర్‌పూర్ | 5780 | 13398 | 9144 | 15651 | 10971 | 16797 | 10133 | 18503 | 10036 | 15594 |
సూరత్‌కల్ | 289 | 1795 | 1030 | 2670 | 1091 | 4302 | 3453 | 6797 | 183 | 4353 |
మేఘాలయ | 8875 | 28684 | 17319 | 31982 | 820 | 32980 | 19669 | 33617 | 20148 | 31054 |
నాగాలాండ్ | 7974 | 32742 | 22098 | 33880 | 19858 | 34555 | - | - | - | - |
పాట్నా | 5729 | 17211 | 11093 | 19490 | 12247 | 20013 | 14429 | 21312 | 12038 | 18731 |
పుదుచ్చేరి | 5842 | 12767 | 6850 | 13289 | 8809 | 15036 | - | - | 9626 | 15387 |
రాయ్‌పూర్ | 5525 | 13009 | 9602 | 15983 | 10869 | 16376 | 13235 | 17922 | 8927 | 15421 |
సిక్కిం | 13338 | 26680 | 18258 | 30768 | 19218 | 30859 | 22967 | 32069 | 13656 | 30131 |
అరుణాచల్ ప్రదేశ్ | 11140 | 25990 | 19153 | 31920 | 11396 | 31647 | 17149 | 32933 | 14893 | 27527 |
జెంషెడ్‌పూర్ | 4866 | 11409 | 5910 | 13155 | 8300 | 15235 | 12019 | 17442 | 7549 | 14421 |
కురుక్షేత్ర | 2710 | 6985 | 5346 | 10471 | 8366 | 12434 | 8587 | 14843 | 4684 | 10789 |
మణిపూర్ | 7842 | 30187 | 18692 | 32624 | 24060 | 33507 | 20640 | 34150 | 22239 | 30550 |
మిజోరాం | 18301 | 31833 | 23242 | 34160 | 19946 | 33965 | 23975 | 34896 | 22641 | 32793 |
రూర్కెల | 2218 | 5788 | 4056 | 6656 | 5448 | 9576 | 7613 | 13278 | 3214 | 7914 |
సిల్చార్ | 3737 | 22606 | 14942 | 25229 | 13749 | 26369 | 18429 | 28408 | 15288 | 22939 |
శ్రీనగర్ | 7089 | 23189 | 14959 | 27756 | 15993 | 27168 | 16835 | 29815 | 16885 | 24302 |
త్రిచీ | 92 | 1213 | 637 | 1792 | 1104 | 3213 | 2711 | 6598 | 582 | 3733 |
ఉత్తరాఖండ్ | 8684 | 19585 | 13671 | 22359 | 11614 | 23611 | 16392 | 23759 | 13363 | 21378 |
సూరత్ | 1832 | 8460 | 5592 | 9479 | 7268 | 11922 | 9706 | 14901 | 3331 | 11128 |
నాగ్‌పూర్ | 1696 | 4663 | 2256 | 5214 | 4732 | 6779 | 6967 | 11481 | 3523 | 6887 |
జలంధర్ | 5780 | 11213 | 9144 | 12714 | 10971 | 13996 | 10133 | 16545 | 10036 | 14235 |