Skip to main content

JEE Mains 2023: పరీక్షలు తేదీలు ఇవే.. పరీక్షకు ఇవి తప్పనిసరి

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్‌ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతాయి.
JEE Mains 2023
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు తేదీలు ఇవే..

తెలంగాణలో ఈ పరీక్షల కోసం 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. జేఈఈ పరీక్షలకు సంబంధించి తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌లో ఏప్రిల్‌ 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. అయితే అభ్యర్ధుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా ఈ పరీక్షను నిర్వహించేలా తాజాగా అడ్మిట్‌కార్డుల్లో పొందుపరిచింది. మొత్తంగా ఏప్రిల్‌ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. 

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్

రెండో సెషన్‌కే ఎక్కువమంది హాజరు 

తొలిరోజు పరీక్ష రాసే వారి అడ్మిట్‌కార్డులను ఎన్‌టీఏ ముందు విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షలు రాసే వారి అడ్మిట్‌కార్డులను వరుసగా ముందు రోజుల్లో వెబ్‌సైట్లలో పొందుపర్చనున్నారు. అభ్యర్ధులు తమ పుట్టిన తేదీ, అప్లికేషన్‌ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఈ అడ్మిట్‌కార్డులను డౌన్లోడ్‌ చేసుకోవచ్చునని ఎన్‌టీఏ పేర్కొంది. అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి ఈ అడ్మిట్‌కార్డు కాపీలతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపుకార్డును కూడా తీసుకురావాలని సూచించింది. జనవరిలో ని­ర్వహించిన మొదటి సెషన్‌ పరీక్షలకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్‌టీఏ విడుదల చేసిన అడ్మిట్‌ కార్డుల నోట్‌లో పేర్కొంది.

చదవండి: JEE Main 2023: సెకండ్‌ సెషన్‌కు ఇన్ని లక్షల మంది.. పరీక్షకు ఇవి తప్పనిసరి

జేఈఈ మెయిన్‌ తొలిసెషన్‌ పరీక్షలకు 8.6 లక్షల మంది హాజరు కాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1.5 లక్షల మంది పరీక్ష రాసే వీలుంది. జనవరిలో నిర్వహించిన తొలి సెషన్‌ సమయంలో ఇంటర్‌ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా ఉండడంతో పరీక్ష రాసిన విద్యార్ధుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసిన వారు కూడా రెండో సెషన్‌లో పరీక్షలు రాయనున్నారు. 

చదవండి: JEE Exams 2023 : జేఈఈ పరీక్షలపై ఎన్టీఏ స్పష్టీకరణ.. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు..

Published date : 06 Apr 2023 01:04PM

Photo Stories