NTA Imposes 3-Year Ban On 39 Students: జేఈఈ మెయిన్స్ పరీక్షలో అక్రమాలు.. 39 మంది విద్యార్థులపై మూడేళ్ల పాటు నిషేధం
జేఈఈ మెయిన్స్ పరీక్షలో అక్రమాలకు పాల్పడినందుకు 39 మంది విద్యార్థులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మూడేళ్ల నిషేధం విధించింది. మెయిన్స్ పరీక్షకు ఒక్క ఏడాదిలోనే రెండు వేర్వేరు అప్లికేషన్ నెంబర్లతో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షకు హాజరైన కారణంతో విద్యార్థులై NTA కఠిన చర్యలు చేపట్టింది.
నిబంధనల ప్రకారం.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ పరీక్షకు సెషన్-1, సెషన్-2 అని రెండు పేపర్లు ఉంటాయి. ఏ సెషన్ లో అత్యుత్తమ స్కోర్ వస్తుందో ఆ స్కోర్‌నే పరిగణలోకి తీసుకుంటారు. మెయిన్స్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అయితే నిబంధనలను అతిక్రమించి 39 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నెంబర్లతో పరీక్షకు హాజరైనట్లు NTA గుర్తించింది.
దీంతో వాళ్లందరిని అనర్హులుగా ప్రకటించడమే కాకుండా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. ఇదిలా ఉంటే ఇటావలె జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెషన్-2 ఫలితాలు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విద్యార్థులపై అనర్హత వేటు పడటం గమనార్హం.