JEE Main: రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
ఈ దిశగా ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల చేయాలని భావిస్తున్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ త్వరలో మొదలవనుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే జేఈఈ మెయిన్ ను నిర్వహించాలని భావించినా సీబీఎస్‌ఈ టర్మ్–2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మొదలవుతుండటంతో అవి పూర్తయ్యాకే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జేఈఈ మెయిన్ నిబంధనలు సడలించాలని అన్ని రాష్ట్రాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసేందుకు కనీసం ఇంటర్, ప్లస్–2లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఈసారీ సడలించాలని పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ నిబంధనకు మినహాయింపు ఇవ్వగా తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆ నిబంధనను మళ్లీ అమలు చేయాలని ఎన్ టీఏ భావిస్తోంది. విద్యార్థులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
చదవండి:
JEE Advanced 2022: ఇంటర్‌తోపాటు అటు అడ్వాన్స్‌డ్‌కూ... నిపుణుల సలహాలు, సూచనలు....
JEE Advanced 2021 : మా లక్ష్యం ఇదే..మా సక్సెస్ సీక్రెట్స్ ఇవే..
NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్ సొంతం