NEET UG 2024: సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ పై నేడు విచారణ
ఢిల్లీ: ఇవాళ సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ, అవతకవకలపై విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చివరి సారిగా ‘జులై 8న అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ లీకేజీపై వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ సమయంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీకేజీపై తమ స్పందనలు తెలియజేస్తూ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు
సీల్డ్ కవర్లో సీబీఐ దర్యాప్తు నివేదిక
విచారణ సందర్భంగా నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కే పరిమితమని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని స్పష్టం చేయగా.. నీట్ లీక్‌పై సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఇవాళ నీట్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: రేపట్నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం.. అప్పటిలోగా రిపోర్ట్ చేయకపోతే సీటు కోల్పోయే ఛాన్స్
నీట్‌లో పేపర్ లీకేజీపై వరుస అరెస్ట్‌లు
మరోవైపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు 14మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈ వారంలో.. కీలక నిందితుడు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య, అతని సహాయకుడు రాజుసింస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణలో పంకజ్ కుమార్ హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ ప్రశ్నపత్రం తస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
Tags
- Supreme Court of India
- NEET UG Counselling 2024
- National Testing Agency
- NEET MBBS Paper Leak
- NEET MBBS Scam
- sakshieducation latest news
- neet paper leak
- NEETUGPaperLeakage
- NEETIrregularities
- ChiefJusticeChandrachud
- NationalTestingAgency
- CentralGovernment
- NEETExamHearing
- SupremeCourtInquiry
- NEETPetitioners
- July18Hearing
- SakshiEducationUpdates