JEE Main Exam Centers : జేఈఈ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల ఆవేదన.. ప్రభుత్వం స్పందించాలని తల్లిదండ్రుల విన్నపం.. కారణం ఇదే..

సాక్షి ఎడ్యుకేషన్: త్వరలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం విద్యార్థులు ఇప్పటికే వారి హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. చాలామంది విద్యార్థులు వారి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించుకున్నారు కూడా. అయితే, ఇక్కడే కొందరు విద్యార్థులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..
జేఈఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, విద్యార్థులు అందులో ఉన్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించుకున్నారు. కాని, ఇద్దరు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాత్రం విద్యాశాఖ కేటాయించిన పరీక్ష కేంద్రంపై ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలను పరిశీలిస్తే.. ఆ విద్యార్థులిద్దరు పరీక్షా కేంద్రాలుగా భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి ఆప్షన్లను ఎంచుకున్నారు.
NEET UG-2025:నీట్ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే.. అక్రమాలకు తావు లేకుండా పరీక్ష విధానం: ఎన్‌టీఏ
రెండు రోజులు.. రెండు ప్రాంతాలు..
ఎన్‌టీఏ ఈ పరీక్షలను నిర్వహించడంతో వారే విద్యార్థుల కేంద్రాన్ని కేటాయిస్తారు. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 29న పేపర్- 1 పరీక్షను లడఖ్ కార్గిల్‌లోని కేంద్రంలో కేటాయించగా, మరుసటి రోజు అంటే.. ఈ నెల 30న నిర్వహించే పేపర్ – 2 వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. అయితే, భీమవరంలో ఉండే విద్యార్థులు 3,000 కిలో మీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఉన్న సమయంలో ఎలా చేరుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తొలి పేపర్ ఇలా ఉంటే, మరో పేపర్‌కు లడఖ్ నుంచి వైజాక్‌లో ఉన్న కేంద్రానికి మరుసటి రోజుకే ఎలా చేరుకోగలరు అని ప్రశ్నిస్తున్నారు.
స్పందన లేదు
తిరుమల కాలేజ్‌లో పడవల సాయి లోకేష్, కేతా తేజ చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.
పరీక్షా కేంద్రం గురించి తెలుసుకున్నప్పుడు, ఎన్‌టీఏ కాల్ సెంటర్‌కు కాల్ చేసినా, మెయిల్స్ చేసినా ఇలా ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందన రాలేదు. 29న లడఖ్‌లో, 30న వైజాగ్‌లో పరీక్ష రాయడం ఎలా సాధ్యమని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందించి.. కేంద్ర విద్యాశాఖతో మాట్లాడి పరీక్షా కేంద్రం మార్పు చేయాలని విన్నవించుకుంటున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main 2025
- inter students
- ap intermediate students
- AP government
- Education Department
- students anger on exam centers
- JEE Main 2025 Exam Centers
- jee exams for engineering admissions
- btech entrance exams
- academic year entrance exams
- ladakh and vizag exam centers
- two days jee main
- ap government response
- parents and students anger on ap education department
- National Testing Agency
- exam centers allotment
- jee main 2025 exam centers allotment
- jee main 2025 candidates
- jee main 2025 hall ticket download
- Education News
- Sakshi Education News