JEE Advanced 2022: ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ
Sakshi Education
JEE Advanced 2022 పరీక్షలో ఎస్సీ గురుకులాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి, 37 మంది అర్హత సాధించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సెప్టెంబర్ 11న ఒక ప్రకటనలో తెలిపారు.
వారిలో 30 మందికి ఐఐటీల్లో సీట్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చిన్న టేకూరు, ఈడ్పుగల్లు, అడవి తక్కెళ్లపాడులో ఉన్న మూడు జేఈఈ శిక్షణ కేంద్రాల నుంచి 72 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాశారని తెలిపారు. చిన్నటేకూరు కేంద్రం నుంచి హాజరైన 15 మందికి, అడవి తక్కెళ్లపాడు కేంద్రం నుంచి 10 మందికి, ఈడ్పుగల్లు కేంద్రం నుంచి ఐదుగురు విద్యార్థులకు ఐఐటీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉందని వివరించారు. అర్హత సాధించిన మిగిలిన విద్యార్థులకు కూడా ఎన్‌ఐటీతోపాటు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని తెలిపారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులు, అధికారులకు మంత్రి నాగార్జున అభినందనలు తెలిపారు.
చదవండి:
JEE Advanced 2022: టాప్ టెన్‌లో ఐదుగురు తెలుగు విద్యార్థులు విరే..
Published date : 12 Sep 2022 01:38PM