APPSC Group 1&2 Coaching: 20న గ్రూప్–1, 2 కోచింగ్ ఎంపికకు ప్రవేశపరీక్ష
Sakshi Education
తుమ్మపాల: ఏపీ స్టడీ సర్కిల్, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్–1, 2 కోచింగ్ ఎంపికకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి టి.అజయ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సవమాచారం పంపామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఏపీఎస్‌టీడీసీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. రెండు గంటల పాటు 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో ప్రశ్నపత్రం బహుళ ఎంపిక విధానంలో ఉంటుందని పేర్కొన్నారు.
చదవండి: APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు
Published date : 19 Aug 2023 05:12PM