JEE Advanced 2022: టాప్ టెన్‌లో ఐదుగురు తెలుగు విద్యార్థులు విరే..
టాప్ టెన్‌లో ఐదుగురు చోటు దక్కించుకుంటే, వందలోపు ర్యాంకుల్లో 25, టాప్ 200లో 48, 300లో 79 మంది, టాప్ 400లో వందకుపైగా మనవాళ్ళే ఉన్నారు. జేఈఈ అడ్వా న్స్‌డ్ ఫలితాలను ముంబై ఐఐటీ సెప్టెంబర్ 11న ప్రకటించింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు అడ్వాన్స్‌డ్ రాస్తారు. మెయిన్స్‌లో 2.4 లక్షల మంది అర్హత సాధించినప్పటికీ, అడ్వాన్స్‌డ్‌కు 1,55,538 మంది మాత్రమే హాజర య్యారు. వీరిలో 40,712 మంది అర్హత పొందినట్టు IIT Madras తెలిపింది. ఇందులో 6,516 మంది బాలికలున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది ఐఐటీ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యారు. వీళ్ళందరినీ IIT Madras జోన్ కింద పరిగణిస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెండు తెలుగు రాష్ట్రాలు ఈ జోన్ పరిధిలో ఉంటాయి.
చదవండి: ‘ఐఐటీ మద్రాస్’బీఎస్సీ డిగ్రీలో కొత్త సబ్జెక్టులు
314 మార్కులతో టాప్ ర్యాంక్
ఐఐటీ ముంబై జోన్ నుంచి ఆర్‌కె శిశిర్ 360 మార్కులకు 314 సాధించి జాతీయ టాపర్‌గా నిలిచారు. ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్కా కబ్రా మహిళ విభాగంలో 277 మార్కులతో మొదటి స్థానంలో ఉన్నారు. టాప్ టెన్ ర్యాంకర్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (2వ ర్యాంకు), వంగపల్లి సాయి సిద్ధార్థ (4వ ర్యాంకు), పొలిశెట్టి కార్తికేయ (6వ ర్యాంకు), ధీరజ్ కురుకుండ (8వ ర్యాంకు), వెచ్చా జ్ఞాన మహేష్ (10వ ర్యాంకు) ఉన్నారు. టాప్ టెన్ ర్యాంకుల్లో మద్రాస్ జోన్‌కు చెందిన ఐదుగురు ఉంటే, వీరిలో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కావడం గమనార్హం. కాగా రిజర్వ్‌డ్ కేటగిరీల్లోనూ మన విద్యార్థులు సత్తా చాటారు.
చదవండి: Fellowships: హైదరాబాద్ IIIT ఫెలోషిప్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం
అర్హత ఇలా...
అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించేందుకు ఐఐటీ ముంబై నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సబ్జెక్టులో రావాల్సిన కనీస మార్కులు, అలాగే మొత్తం ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లో తెలిపింది.
కేటగిరీ |
ప్రతి సబ్జెక్టులో రావాల్సిన మార్కులు |
రావాల్సిన మొత్తం మార్కులు |
సాధారణ విభాగం |
5 |
55 |
ఓబీసీ–ఎన్‌సీఎల్ |
5 |
50 |
ఈడబ్ల్యూఎస్ |
5 |
50 |
ఎస్సీ |
3 |
28 |
ఎస్టీ |
3 |
28 |
పీడబ్ల్యూడీ |
3 |
28 |
ఈడబ్ల్యూఎస్ |
|
|
పీడబ్ల్యూడీ |
3 |
28 |
ఎస్టీ, ఎస్సీ–పీడబ్ల్యూడీ |
3 |
28 |
కేటగిరీల వారీగా జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత పొందిన వారు....
కేటగిరీ |
హాజరైన వారు |
అర్హత పొందిన వారు |
జనరల్ |
38180 |
15277 |
ఓబీసీ |
56538 |
9341 |
ఈడబ్ల్యూఎస్ |
24104 |
5032 |
ఎస్సీ |
25287 |
7998 |
ఎస్టీ |
11429 |
3064 |
నేటి నుంచి జోసా కౌన్సెలింగ్
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు కూడా వెల్లడవ్వడంతో ఐఐటీ, ఎన్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలవ్వనుంది. సోమవారం నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్టు సంబంధిత విభాగం ప్రకటించింది. దేశంలో 23 ఐఐటీలున్నాయి. వీటిల్లో 16,598 సీట్లున్నాయి. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యదికంగా 2,129 మెకానికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
100 లోపు ఆలిండియా ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు
పేరు |
ఆలిండియా ర్యాంకు |
పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి |
2 |
వంగపల్లి సాయి సిద్ధార్థ |
4 |
పోలిశెట్టి కార్తికేయ |
6 |
ధీరజ్ కురుకుంద |
8 |
వెచ్చా జ్ఞాన మహేష్ |
10 |
నందన్ మంజునా«థ్ ఇమ్మిడిశెట్టి |
12 |
పెనికలపాటి రవికిషోర్ |
14 |
మెండ హిమవంశీ |
22 |
పల్లి జలజాక్షి |
24 |
వెంకటసాయి ముకేష్ మిరియాల |
33 |
నక్కా సాయి దీప్తిక |
34 |
బి.హరేన్ సాత్విక్ |
40 |
కె.సాయి ఆదిత్య |
43 |
అక్షత్‌రెడ్డి అవనగంటి |
44 |
ఎ.వర్షిత్ |
61 |
కజ్జయం వరుణ్ గుప్తా |
62 |
గండు హరిదీప్ |
63 |
దయ్యాల జాన్ జోసెఫ్ |
73 |
టీఎస్‌ఎస్ బృహదీశ్వరరెడ్డి |
82 |
పి.సాయికమల్ |
86 |
జానపతి సాయి చరిత |
87 |
రథంశెట్టి రుషికేశ్ |
95 |
దరిశిపూడి శరణ్య |
98 |
ర్యాంకర్ల మనోగతం
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా..
మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచ్చింది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను.
– పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్
నాలుగో ర్యాంక్ వచ్చింది.
మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్‌కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం.
– వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్
బీటెక్ చదువుతా..
మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం.
– ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్
యూఎస్‌లో ఎంఎస్ చదువుతా..
మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం.
– వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్
ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే..
మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను.
– సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం..
మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్‌లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం.
– అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్
పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా..
మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్‌ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా.
– గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్
సామాజిక సేవే లక్ష్యం..
మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం.
– తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్