Skip to main content

ఇంటర్ బోటనీ ప్రాక్టికల్ పరీక్షలకు సూచనలు

Bavitha
  • విద్యార్థి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అంచనా వేసేలా ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. దీన్ని 30 మార్కులకు, మూడు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. కచ్చితమైన సమాచారాన్ని ఇస్తే మంచి మార్కులు సొంతమైనట్లే.
  • పశ్నపత్రంలో మొత్తం అయిదు ప్రశ్నలుంటాయి. మొదటి ప్రశ్నలో ఇచ్చిన కొమ్మ తాలూకు వివిధ భాగాల్ని వర్ణించాలి. పుష్ప విన్యాసంతో ఉన్న కొమ్మ, పుష్పం నిలువుకోత పటాలు గీసి, భాగాలు గుర్తించాలి. పుష్ప చిత్రంతో పాటు సంకేతం ఇవ్వాలి. స్పష్టంగా పటాలను గీయడం, భాగాలను గుర్తించడంలో పట్టు సాధించాలి. దీనికి ప్రాక్టీస్ ప్రధానం. దీనికి ఆరు మార్కులు.
శాఖీయ లక్షణాలను సాంకేతిక

శాఖీయ లక్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించినందుకు

1 మార్కు

పుష్ప లక్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించినందుకు

2 మార్కులు

కుటుంబాన్ని గుర్తించినందుకు

1 మార్కు

పుష్ప విన్యాసం

1/2 మార్కు

పుష్ప చిత్రం గీసినందుకు

1/2 మార్కు

పటాలు గీసిందుకు

1 మార్కు

  • రెండో ప్రశ్నలో ఇచ్చిన మెటీరియల్ నుంచి అడ్డుకోత తీసి, స్లైడ్ తయారు చేయాలి. Dicot and Monocot stems, Dicot and Monocot rootsను అధ్యయనం చేయాలి.

స్లైడ్ రూపకల్పనకు

3 మార్కులు

గుర్తించినందుకు

1 మార్కు

పటానికి

2 మార్కులు

  • మూడో ప్రశ్నలో ప్రయోగానికి ఆరు మార్కులుంటాయి. నాలుగు ప్రయోగాల్లో విద్యార్థికి ఒకటి ఇస్తారు. ఈ ప్రయోగాలకు సిద్ధమయ్యేందుకు లేబొరేటరీ మాన్యువల్‌ను ఉపయోగించుకోవాలి. దీనికి 6 మార్కులు.
    ప్రయోగం 1: Osmosis by potato Osmoscope
    ప్రయోగం 2: Study of Plasmolysis in epidermal peel of leaf.
    ప్రయోగం 3: Transpiration by Cobalt Chloride method
    ప్రయోగం 4: Separation of leaf pigments or Chloroplast pigments' by paper chromatographic technique.

ప్రయోగం చేసినందుకు

3 మార్కులు

ప్రయోగ విధానం రాసి, పటాలు గీసినందుకు

3 మార్కులు

 
  • నాలుగో ప్రశ్నలో సరైన కారణాలతో స్పెసిమన్‌ను గుర్తించాలి. దీనికి అయిదు మార్కులు. ఇందులో డి నుంచి హెచ్ వరకు ప్రశ్నలుంటాయి. ప్రతి దానికి ఒక మార్కు.
  • రికార్డుకు అయిదు మార్కులు, హెర్బేరియంకు రెండు మార్కులుంటాయి. సిలబస్‌లో పేర్కొన్న కుటుంబాలకు సంబంధించి కనీసం 15 హెర్బేరియం షీట్లు ఉండేలా చూసుకోవాలి. ఆకులు, పుష్పాలు ఉండే కొమ్మలను సేకరించాలి.

- బి.రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ

Published date : 28 Jan 2016 01:58PM

Photo Stories