Skip to main content

‘సంస్కృతం’ సెకండ్‌ లాంగ్వేజ్‌గా ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరణ!

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో సంస్కృతాన్ని సెకండ్‌ లాంగ్వేజ్‌గా ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరిస్తామని ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తమకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి సమన్వయకర్త మాచర్ల రామకృష్ణగౌడ్‌ తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా సంస్కృతాన్ని చేర్చాలని ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఇచ్చిన మెమో ఉన్నతస్థాయిలో చర్చకు దారితీసింది. కమిషనర్‌ తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులను ఉపసంహరిస్తామని కమిషనర్‌ హామీయిచ్చినట్లు సమితి ప్రకటించింది.

చ‌ద‌వండి: ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం– 2019.. ముఖ్యాంశాలు..!

చ‌ద‌వండి: ఇంకా విడుదలవ్వని తెలంగాణ స్కూల్‌ అకడమిక్‌ 2021–22 క్యాలెండర్‌
Published date : 13 Jul 2021 02:36PM

Photo Stories