Inter Examinations: ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి కృషిని ఉత్తీర్ణం చేయాలి
Sakshi Education
ప్రిన్సిపాళ్లతో జరిపిన సమావేశంలో ఇంటర్ ఆర్‌జేడీ పలు సూచనలను ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు తెలిపారు. ఇంటర్ లో విద్యార్థులు ఇంకా కృషి చేయాలని పేర్కొన్నారు.
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతను సాధించేందుకు అన్ని ప్రభుత్వ యాజమాన్య కళాశాలల ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని ఇంటర్ ఆర్‌జేడీ రవి పేర్కొన్నారు. సోమవారం కడప మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం జరిగింది.
Employment Offer: ఐటీఐ కళాశాలలో ఉపాధి అవకాశం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో విద్యార్థులకు జరిగే ఇంటర్ క్వార్టర్లీ పరీక్షలకు డిజిటల్ ప్రశ్నపత్రం వస్తుందని తెలిపారు. దీనికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రభుత్వం డిజి లాకర్ యాప్‌ను ప్రవేశ పెడుతోందన్నారు. దీంతో విద్యార్థులు ఎలాంటి పేపర్ లేకుండా డాక్యుమెంట్ భద్రపరుచుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీవీఈఓ శ్రీనివాసులరెడ్డి, ఆర్‌ఐవో రమణరాజు తదితరులు పాల్గొన్నారు.
Published date : 26 Sep 2023 05:24PM