Change in Science Syllabus: 2 సైన్స్ సిలబస్‌లో మార్పు
భువనేశ్వర్: 2 సైన్స్ సిలబస్ మార్పుతో కొత్త పరీక్ష ప్రణాళిక ప్రవేశ పెడుతున్నట్లు ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) ప్రకటించింది. దీనిలో భాగంగా పాత సిలబస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం మరియు బయాలజీలోని కొన్ని అధ్యాయాలు తొలగించారు. వచ్చే ఏడాదిలో జరగనున్న 2 సైన్స్ వార్షిక పరీక్ష కొత్త సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు. సీబీఎస్‌ఈ ద్వారా తొలగించబడిన అధ్యాయాల ఆధారంగా ఉన్నత మాధ్యమిక విద్యా మండలి (సీహెచ్‌ఎస్‌ఈ) కొత్త సిలబస్‌కు ఆమోదం తెలిపింది.
Medical College: మెడికల్ కాలేజీ పనులు పూర్తిచేయాలి
కొత్త పరీక్ష ప్రణాళిక
ఏటా నిర్వహిస్తున్న 3 త్రైమాసిక పరీక్షలకు బదులుగా, 2 అంతర్గత (ఇంటర్నల్) పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం కౌన్సిల్ పరీక్షలో 80% మరియు అంతర్గత పరీక్షలో 20% మార్కుల ఆధారంగా సమగ్రంగా మార్కులు కేటాయిస్తారు. ఈ మేరకు ఉన్నత మాధ్యమిక విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, కామర్స్, వృత్తి విద్యా కోర్సు విభాగంలో మాత్రం సిలబస్ మారలేదు. సవరించిన సిలబస్ వివరాలు సీహెచ్‌ఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ www.chseodisha.nic.in లో అందుబాటులో ఉంచారు. 2024 వార్షిక హయ్యర్ సెకండరీ పరీక్షకు హాజరయ్యే 11వ తరగతి విద్యార్థుల కోసం ఒడిశా స్టేట్ బ్యూరో ఆఫ్ టెక్ట్స్‌బుక్స్ ప్రిపరేషన్ అండ్ ప్రొడక్షన్ ప్రచురించిన పాఠ్యపుస్తకాలతో పాటు న్యూ ఢిల్లీలోని ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ పుస్తకాలు సిఫార్సు చేయబడ్డాయి. వార్షిక హయ్యర్ సెకండరీ పరీక్షలు–2024 రాసే విద్యార్థుల కోసం గణితం పుస్తకాలు ఒడిషా స్టేట్ బ్యూరో ఆఫ్ టెక్స్‌ట్ బుక్స్ ప్రిపరేషన్ మరియు ప్రొడక్షన్ ప్రచురించిన పాఠ్యపుస్తకాలు సిఫార్సు చేయబడ్డాయి.